కంది/ సంగారెడ్డి కలెక్టరేట్, సెప్టెంబర్ 2: ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో ఎలాంటి ప్రాణనష్టం జరుగకుండా అధికార యంత్రాంగం పకడ్బందీ చర్యలు చేపట్టాలని వైద్యారోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహ ఆదేశించారు. సంగారెడ్డి శివారులోని మంజీరా డ్యామ్‌కు భారీగా వరద ఉధృతి కొనసాగుతున్నందున సోమవారం సాయం త్రం ఆయన పరిశీలించారు.
వరద ఉధృతికి సంబంధించిన వివరాలను అధికారులను అడి గి తెలుసుకున్నారు. ప్రతిక్షణం అప్రమత్తంగా ఉంటూ వరద ఉధృతిని గమనించాలని సూచించారు. సంగారెడ్డి జిల్లాలో చెరువులు, వాగులు, కల్వర్టులు పొంగిపొర్లుతున్నందున జాగ్రత్తలు చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు.
వర్షాలతో పంటలు నష్టపోయిన రైతాంగాన్ని, ఆస్తినష్టం జరిగిన బాధితులను ప్రభుత్వం ఆదుకుంటుందన్నారు. సీజనల్ వ్యాధులు ప్రబలకుండా చూడాల న్నారు. అనంతరం సంగారెడ్డి కలెక్టరేట్లో కలెక్టర్ వల్లూ రు క్రాంతి, ఎస్పీ రూపేశ్, వివిధ శాఖల అధికారులతో భారీ వర్షాలపై మంత్రి సమీక్షించారు. కార్యక్రమంలో టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి, సంబంధిత శాఖల అధికారులు పాల్గొన్నారు.