సంగారెడ్డి కలెక్టరేట్, ఆగస్టు 8: సీఎస్ఆర్ నిధులతో సంగారెడ్డి జిల్లాలో చేపట్టిన అభివృద్ధి పనులను వేగవంతం చేయాలని వైద్యారోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ అధికారులను ఆదేశించారు. గురువారం కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో వివిధ అభివృద్ధి పనులపై సమీక్షించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ 2023-24 సంవత్సరానికి జిల్లాలో రూ.160 కోట్ల సీఎస్ఆర్ నిధులు బకాయిలు ఉన్నట్లు తెలిపారు.
పరిశ్రమల శాఖ, జీఏంపెసీబీ, ఈడీ మైన్స్, పొల్యూషన్ కంట్రోల్ బోర్డు సిబ్బంది, విద్యాశాఖ, ఎక్సైజ్ తదితర శాఖలు సమన్వయంతో పనిచేసి జిల్లాలో సీఎస్ఆర్ పనులు వేగంగా పూర్తయ్యేలా కృషి చేయాలన్నారు. జిల్లాలో యువత డ్రగ్స్ బారిన పడకుండా కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతిఒక్కరిపై ఉన్నదన్నారు. సంగారెడ్డి కలెక్టర్ వల్లూరు క్రాంతి, అదనపు కలెక్టర్లు చంద్రశేఖర్, మాధురి, ట్రైనీ కలెక్టర్ మనోజ్, అధికారులు పాల్గొన్నారు.