మెదక్, సెప్టెంబర్ 4 (నమస్తే తెలంగాణ): మెదక్ మెడికల్ కళాశాలకు అనుమతులకు సంబంధించి అప్పీల్‌కు వెళ్లామని, అనుమతి వస్తుందని ఆశిస్తున్నామని వైద్యారోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ అన్నారు. బుధవారం మెదక్ కలెక్టరేట్లో అభివృద్ధి, సంక్షేమంపై రివ్యూ సమావేశాం అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. విద్య, వైద్యం, వ్యవసాయం, రుణమాఫీపై సమీక్ష చేశామన్నారు. ఉన్నత ప్రమాణలాతో కూడిన విద్యను అందించాలని, అసంపూర్తిగా ఉన్న సబ్ సెంటర్లను పూర్తి చేసేందుకు చర్యలు చేపట్టాలని సంబంధిత శాఖల అధికారులను ఆదేశించామన్నారు.
ఏరియా దవాఖానలో బెడ్ల సంఖ్య పెంచేందుకు కృషి చేస్తున్న ట్లు తెలిపారు. రెవెన్యూ దరఖాస్తులపై సమగ్రంగా విశ్లేషించాలని ఆదేశించామన్నారు. మెదక్ మెడికల్ కళాశాలకు సంబంధించి అప్పీల్‌కు వెళ్లామని, తప్ప క అనుమతి వస్తుందని ఆశిస్తున్నట్లు తెలిపారు. సర్కారు సూల్స్‌లో కనీస సామర్థ్యాలు పెరగాలని, పాఠశాలలను బలోపేతం చేయాల్సిన బాధ్యత సం బంధిత అధికారులపై ఉన్నదన్నారు. ప్రతినెలా వైద్యం, విద్యపై రివ్యూ నిర్వహించాలన్నారు. విద్యా, వైద్యానికి నిధులు కేటాయించడానికి తాను సిద్ధంగా ఉన్నానని, అమ్మాయిలు చదువుకు అన్ని సౌకర్యాలు కల్పించే బాధ్యత ప్రభుత్వం పైన ఉన్నదని తెలిపారు.
విద్య, వైద్యంపై కలెక్టర్ టాస్ఫో ర్స్ కమిటీ వేయాలన్నారు. ఫీల్డ్ విజిట్ చేసి భూమి సేకరించాలని, కొత్త పీహెచ్‌సీలను త్వరలోనే ఏర్పా టు చేస్తామని చెప్పారు. నిర్మల్ జిల్లా కలెక్టర్ వైద్య శాఖపై చేస్తున్న కృషి అభినందనీయమని, అకడ ఎలా పనిచేస్తున్నారో తెప్పించుకోండి అని మంత్రి సూచించారు. రెవెన్యూ శాఖ ఆడ్మినిస్ట్రేషన్‌కు గుండెకాయ లాంటిదని, అధికారులు, ఉద్యోగులు కమిట్మెంట్తో పనిచేసి జిల్లాను అభివృద్ధిలో అగ్రగామి గా నిలిపేందుకు కృషి చేయాలని కోరారు. సమావేశంలో ఎమ్మెల్యేలు మైనంపల్లి రోహిత్, సునీతారెడ్డి, కొత్త ప్రభాకర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.