సంగారెడ్డి, ఆగస్టు 15: పోలీసు విభాగంలో ఉత్తమ సేవలందించిన పోలీసు సిబ్బందికి వైద్యారోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహ పతకాలు ప్రదానం చేశారు. గురువారం స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని పెరేడ్ గ్రౌండ్లో జరిగిన వేడుకల్లో పోలీసులకు పతకాలు పంపిణీ చేశారు.
పతకాలు అందుకున్న వారిలో ఉత్తమ సేవ పతకంలో ఎస్బీ ఎస్సై యాదవరెడ్డి, ఆర్ఎస్సైలు ఖదీరుద్దీన్, సంజీవరెడ్డి, ఏఎస్సై సంజీవ్, ఐటీ సెల్ హెడ్ కానిస్టేబుల్ విజయ్‌కుమార్ ఉన్నారు. సేవా పతకాల్లో పటాన్చెరు ఎస్సై అభిమాన్ సింగ్, ఆర్ ఎస్సై సలాం, ఏఎస్సైలు జగదీశ్, వేణుగోపాల్, లక్ష్మారెడ్డి, ఏఆర్ ఎస్సై నాగార్జున, హెడ్ కానిస్టేబుల్ రమేశ్, గోపాల్, ప్రేమ్ కుమార్, శివకుమార్, షేక్ ముక్తార్ ఉన్నారు. అనంతరం పోలీసు విభాగంలో ఉత్తమ సేవలందించిన ప్రతిఒక్కరినీ అభినందించారు.