సంగారెడ్డి, నవంబర్ 6: గ్రంథాలయాలు విజ్ఞాన కేంద్రాలు అని, విద్యార్థి దశ నుంచే ప్రతిఒక్కరూ పుస్తక పఠనం అలవాటు చేసుకుంటే జ్ఞానం పెరిగి భవిష్యత్ బంగారుమయం అవుతుందని వైద్యా రోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ అ న్నారు. సంగారెడ్డిలోని పీఎస్ఆర్ గార్డెన్లో బుధవారం జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్గా రాయికోడ్ మాజీ జడ్పీటీసీ గొల్ల అంజయ్య పదవీ బాధ్యతలు చేపట్టారు.
కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మంత్రులు దామోదర రాజనర్సింహ, కొం ఎడా సురేఖ, రాష్ట్ర గ్రంథాలయాల చైర్మన్ రియాజ్, నారాయణఖేడ్ ఎమ్మెల్యే సంజీవరెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా మంత్రి దామోదర మాట్లాడుతూ..నేటితరం సెల్ఫోన్లకే పరిమి తం కాకుండా మంచి పుస్తకాలు చదివి విజ్ఞానం పెంచుకోవాలన్నారు.
గ్రంథాలయాల్లో పోటీ పరీక్షలతోపాటు ఇతర పుస్తకాలు అందుబాటులో ఉం చుతున్నట్లు తెలిపారు. కొత్త చైర్మన్ సారథ్యంలో జిల్లాలో గ్రంథాలయాలు మరింత అభివృద్ధి చెంది పాఠకుల ఆదరణ పొందాలని మంత్రి ఆకాక్షించా రు. కార్యక్రమంలో టీజీఐఐసీ చైర్పర్సన్ తూర్పు నిర్మలారెడ్డి, గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్ తోపాజి అనంత కిషన్, గ్రంథాలయ సంస్థ కార్యదర్శి వసుంధర, నాయకులు పాల్గొన్నారు.