చౌటకూర్, జూలై 23: మహిళా సాధికారతే ప్రభుత్వ లక్ష్యమని వైద్యారోగ్యశాఖ మంత్రి దామోదర రాజనరసింహ అన్నారు. సంగారెడ్డి జిల్లా చౌటకూర్ మండలంలోని సుల్తాన్పూర్ గ్రామ శివారులో ఓ ఫంక్షన్ హాల్లో బుధవారం అందోలు నియోజకవర్గం ఇందిరా మహిళా శక్తి విజయోత్సవాలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మంత్రి ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు.
మహిళా స్వయం సహాయక సంఘం ద్వారా రాష్ట్రంలోనే మొట్టమొదటగా సంగారెడ్డి పట్టణంలోని బైపాస్ రోడ్డులో పెట్రోల్ బంక్ ఏర్పాటు చేయడం సంతోషించదగ్గ విషయమన్నారు. అందోలు అసెంబ్లీ నియోజకవర్గంలోని అన్ని గ్రామాల్లో స్వయం సహాయక సంఘాలకు భవనాలు నిర్మిస్తానని హామీ ఇచ్చారు. బ్యాంకు లింకేజీ, వడ్డీ లేని రుణం, ప్రమాద బీమా, లోన్ బీమా కింద మొత్తం 64.81 కోట్ల చెక్కులను మంత్రి మహిళలకు అందజేశారు.
ఇందిరా మహిళా శక్తి విజయోత్సవాలకు హాజరైన మహిళలకు వసతులు కల్పించడంలో ఐకేపీ నిర్వాహకులు పూర్తిగా విఫలమయ్యారు. మంత్రి దామోదర రాజనరసింహ ప్రసంగం ముగిసిన తర్వాత భోజనాల కోసం వెళ్లిన మహిళలు ఒక్కసారిగా ఎగబడటంతో తొక్కిసలాట జరిగింది.
టీజీఐఐసీ చైర్ పర్సన్ నిర్మలాజగ్గారెడ్డి, అదనపు కల్టెర్ చంద్రశేఖర్, డీఆర్డీఏ పీడీ జ్యోతి, ఆర్డీవో పాండు, డీఎస్పీ సత్తయ్య, మార్కెట్ కమిటీ చైర్మన్ జగన్మోహన్రెడ్డి, ఆత్మ కమిటీ చైర్మన్ మల్లారెడ్డి, డీసీసీబీ మాజీ డైరెక్టర్ రామచంద్రారెడ్డి, పుల్కల్, చౌటకూర్ మండలాల కాంగ్రెస్ అధ్యక్షులు దుర్గారెడ్డి, దశరథ్, నాయకులు ఈశ్వర్‌గౌడ్, రామాగౌడ్, రమేశ్, కైసర్, సరాఫ్పల్లి రామచంద్రారెడ్డి, సంగమేశ్వర్‌గౌడ్, రామకృష్ణారెడ్డి, మల్లికార్జున్‌గౌడ్, రాములు, శివకుమార్ పాల్గొన్నారు.