మెదక్ రూరల్, అక్టోబర్ 17 : మెదక్ జిల్లా హవేలీ ఘన్పూర్ మండలం డైట్ కళాశాలలో, ప్రభుత్వ పాఠశాలల్లో ఫౌండేషనల్ లిటరసీ అండ్ న్యూమర్సీ (ఎఫ్ఎల్ఎన్) అమలుపై ఆయా మండలాల ఎంఈఓలు, స్కూల్ కాంప్లెక్స్ ప్రధానోపాధ్యాయులకు అవగాహన కార్యక్రమం ఏర్పాటు చేశారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. ఎఫ్ఎల్ఎన్ అమలులో భాగంగా ప్రాథమిక స్థాయి నుండి విద్యార్థులకు కనీస సామర్థ్యాలు పెంచి గుణాత్మక విద్యాబోధన ద్వారా బావిభారత పౌరులుగా తీర్చిదిద్దాలని ఉద్దేశంతో నిరుపేద విద్యార్థులకు నాణ్యమైన గుణాత్మక విద్యను అందించడానికి రాష్ట్ర ప్రభుత్వం విద్యా వ్యవస్థను బలోపేతం చేసే దిశగా ముందుకు పోతుందని ప్రాథమిక స్థాయి నుండి విద్యార్థుల సామర్థ్యాలు పెంపు దిశగా ఉపాధ్యాయులు కృషి చేయాలన్నారు. మండల విద్యాశాఖ అధికారి, స్కూల్ కాంప్లెక్స్ ప్రధాన ఉపాధ్యాయులు, విధిగా నిర్దేశించిన లక్ష్యాల మేరకు క్షేత్రస్థాయిలో పాఠశాలలను సందర్శించి ఉపాధ్యాయుల, విద్యార్థుల హాజరుపై ప్రత్యేక దృష్టి సారించాలని, పట్టిషంగా అమలు చేసి విద్యార్థులందరు కనీస అభ్యసన సామర్థ్యాలు సాధించేలా చర్యలు తీసుకోవాలని చెప్పారు.
ఈ సంవత్సరం 10వ తరగతి విద్యార్థులందరూ 100 శాతం ఉత్తీర్ణత పొందే విధంగా కృషిచేయాలని, ఎంఈఓలు, స్కూల్ కాంప్లెక్స్ హెచ్ఎంలు పాఠశాలలను సందర్శించినప్పుడు ఒక పాఠశాలలో సుమారు 35 నిమిషాల సమయం కేటాయించాలన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా విద్యాశాఖ అధికారి రాధా కిషన్, అసిస్టెంట్ మానిటరింగ్ అధికారి సుదర్శన్ మూర్తి, స్కూల్ కాంప్లెక్స్ ప్రధానోపాధ్యాయులు, మండల విద్యాధికారులు పాల్గొన్నారు.