నిజాంపేట,మే5 : వేసవి సెలవులలో ఉన్నత పాఠశాల స్థాయిలో ఏర్పాటు చేసిన సమ్మర్ క్యాంప్‌ను విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని ఎంఈవో యాదగిరి సూచించారు. సోమవారం నిజాంపేటలోని ఉన్నత పాఠశాలలో ఏర్పాటు చేసిన సమ్మర్ క్యాంప్‌ను ఎంఈవో ప్రారంభించి మాట్లాడారు. వినోదంతో పాటు విజ్ఞానం పొందుటకు ఈ సమ్మర్ క్యాంప్ దోహదపడుతుందన్నారు.
ఈ నెల 19 వరకు ఉదయం 8 నుంచి 11 వరకు కొనసాగనున్న సమ్మర్ క్యాంప్‌లో కుట్లు, అల్లికలు, ఆటలు, యోగా, డ్రాయింగ్ వంటివి సంబంధిత ఉపాధ్యాయుల చేత నేర్పిస్తారన్నారు. కార్యక్రమంలో ఇంచార్జి ప్రధానోపాధ్యాయుడు మహేందర్, ఉపాధ్యాయులు వెంకటస్వామి, సీఆర్పీ రాజు, క్రాఫ్ట్ టీచర్ రోజా, ఐఈఆర్పీ రాజయ్య, విద్యార్థులు ఉన్నారు.