Jaggareddy | మున్నిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఓడిపోతుందన్న ఫ్రస్టేషన్ ఆ పార్టీ సీనియర్ నేతల ప్రవర్తన చెబుతోంది. పోలింగ్ కేంద్రాల వద్దే ఓ వైపు కాంగ్రెస్ నేతల ప్రలోబాలు, మరోవైపు ఆ పార్టీ అభ్యర్థుల అత్యుత్సాహం.. ఎన్నికల్లో ఓటమి ఖాయమని చెప్పకనే చెబుతున్నాయి.
తాజాగా సంగారెడ్డి మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి మున్సిపల్ ఎన్నికల్లో ఓడిపోతున్నామని ప్రస్టేషన్లో పోలీసులపై బూతు పురాణం అందుకున్నాడు. సంగారెడ్డి మున్సిపాలిటీలోని 34వ వార్డు పోలింగ్ కేంద్రం వద్ద సీఐపై జగ్గారెడ్డి ఊగిపోయారు.
రిగ్గింగ్ చేస్తున్నాడని చెబితే నా అభ్యర్థిని గళ్ల వట్టి కొట్టిండు.. సీఐ శివకుమార్ మొగోడైతే ఈడికి రావాలి. సంగారెడ్డిలో ఏమన్నా లా అండ్ ఆర్డర్ సమస్య వస్తే ఆ సీఐగాడు, హోంగార్డు రావాలే. హోంగార్డులు మీరు ఏమనుకుంటున్నరు.. జగ్గారెడ్డి ఎవరంటారు.. నా క్యాండిడేట్‌ను గళ్లవట్టి ఫోజులు కొడతాంటే నేను ఊరుకోను. సీఐ సంగతి నేను తేల్చేస్తా.. అరే ఓ హోంగార్డు ఒక అమ్మకు అయ్యకు పుట్టి ఉంటే రారా నా కొడుకా.. అంటూ జగ్గారెడ్డి తీవ్ర స్థాయిలో పోలీస్ అధికారులపై విరుచుకుపడిన వీడియో ఇప్పుడు నెట్టింట హల్ చల్ చేస్తోంది.
అసలేం జరిగిందంటే..?
మున్సిపల్ ఎన్నికల్లో భాగంగా ఈ రోజు సంగారెడ్డి పట్టణంలోని 34వ వార్డు ఇందిరా కాలనీలో ఎన్నికల విధులు నిర్వహిస్తున్న సీసీఎస్ సీఐ శివకుమార్, ఇతర సిబ్బంది విధులు నిర్వహిస్తుండగా ఎన్నికల నిబంధనలో భాగంగా మొబైల్ ఫోన్ తీసుకురావద్దని చెప్పడంతో తూర్పు జగ్గారెడ్డి తన కార్యకర్తను ఆపుతారా..? అంటూ ఆగ్రహావేశానికి లోనై సీఐ శివకుమార్, హోంగార్డు చెన్నయ్య పై వ్యక్తిగత దూషణలతో వారి కుటుంబ సభ్యులకు, పోలీసు పరువు ప్రతిష్టలకు భంగం బాటిల్లే విధంగా విధులకు ఆటంకం కలిగిస్తూ దుర్భాషలాడారు.
ఈ సంఘటన రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. తక్షణమే జగ్గారెడ్డిపై అధికారులు కేసు నమోదు చేసి చర్యలు తీసుకోవాలని పలువురు పోలీసులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఇలా రాజకీయ నాయకులు అనునిత్యం దాడులు చేస్తూ మా విలువలను దిగజార్చుతున్నారని.. ఇలాంటి వారిపై కఠిన చర్యలు తీసుకొని సమర్థవంతంగా విధులు నిర్వహిస్తున్న పోలీసులకు పోలీస్ శాఖ, రాష్ట్ర ప్రభుత్వం అండగా నిలబడాలని విజ్ఞప్తి చేస్తున్నారు.
జగ్గారెడ్డి బూతుపురాణం ఇలా..
కొత్తగూడెంలో ప్రశాంతంగా పోలింగ్.. ఓటు వేసిన కలెక్టర్
నల్లగొండలో ఓటేసిన ట్రాన్స్జెండర్లు
Chennuru | పోలింగ్ రోజూ మంత్రి వివేక్ ప్రచారం..! ఎన్నికల సంఘం తీరుపై వెల్లువెత్తుతున్న విమర్శలు