న్యాల్కల్, జూన్ 7 : ప్రభుత్వ పాఠశాలల్లోనే మెరుగైన విద్య అందుతుందని ఎంఈవో మారుతీరాథోడ్ అన్నారు. బాడిబటలో భాగం గా శుక్రవారం మండల పరిధిలోని హద్నూర్, ఖలీల్పూర్, మామిడ్గి, మెటల్‌కుంట, చాల్కి, రేజింతల్, వడ్డి, మామిడ్గి, మెటల్‌కుంట, డప్పూర్, అత్నూర్ తదితర గ్రామాల్లో విద్యార్థులను ప్రభుత్వ పాఠశాలల్లో చేర్పించాలని ఉపాధ్యాయులు ఇంటింటికీ వెళ్లి విద్యార్థుల తల్లిదండ్రులను కోరారు. పాఠశాలల్లో విద్యార్థులకు సన్నబియ్యంతో భోజనం, ఉచితంగా పుస్తకాలు, ఏకరూప దుస్తులను అందజేస్తున్నామని తెలిపారు. కార్యక్రమంలో ఆయా పాఠశాలల హెచ్ఎంలు, ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు.
కల్హేర్, జూన్ 7 : ప్రైవేట్‌కు దీటుగా ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు మెరుగైన బోధన ఉంటుందని ఎంఈవో శంకర్ తెలిపారు. శుక్రవారం మండల పరిధిలోని రాపర్తిలో బడిబాట కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రభుత్వ పాఠశాలల్లో ప్రతిభావంతులైన ఉపాధ్యాయులతో నాణ్యమైన విద్యను బోధించడంతో పాటు విద్యార్థులకు మెరుగైన మౌలిక సదుపాయాలున్నాయని మీ పిల్లలను ప్రభుత్వ పాఠశాలల్లోనే చేర్పించాలని కోరారు.
రాయికోడ్, జూన్ 7 : పిల్లలను ప్రభుత్వ బడిలో చేర్పించాలని రాయికోడ్ ప్రాథమిక పాఠశాల హెచ్ఎం విఠల్ కోరారు. శుక్రవారం రాయికోడ్‌లో బడిబాట ర్యాలీ నిర్వహించా రు. అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న చిన్నారులను ప్రైవేట్ పాఠశాలల్లో చేర్పించవద్దని సూచించారు. ప్రభుత్వ పాఠశాలల్లో కల్పిస్తున్న వసతులను వివరించారు. ర్యాలీలో సిబ్బంది శివకుమార్, సుధాకర్, శ్రావణి,తులసి ఉన్నారు.
జిన్నారం, జూన్ 7 : బడీడు పిల్లలను ప్రభుత్వ పాఠశాలల్లో చేర్పించాలని ఉపాధ్యాయులు కోరారు. శుక్రవారం కొర్లకుంట, మంత్రికుంట, ఊట్ల, అండూరు, కొడకంచి, మంగంపేట, మాదారం, చెట్లపోతారం, నల్తూరు, శివనగర్, అల్లీనగర్ గ్రామాల్లో ఆయా ప్రభుత్వ పాఠశాలల ఉపాధ్యాయులు విద్యార్థులతో కలిసి బడిబాటలో భాగంగా ర్యాలీ నిర్వహించారు. విద్యార్థుల తల్లిదండ్రులను కలిసి ప్రభుత్వ పాఠశాలలో చేర్పించాలని కోరారు.
బొల్లారం, జూన్ 7 : మున్సిపాలిటీ పరిధిలో శుక్రవారం జడ్పీ ఉన్నత, అర్బన్ ప్రాథమిక పాఠశాల ఉపాధ్యాయులు బడిబాట నిర్వహించారు. ఈ సందర్భంగా ఇంటింటికీ వెళ్లి తల్లిదండ్రులను కలిసి పిల్లలను బడిలో చేర్పించాలని కోరారు. ప్రభుత్వ పాఠశాలల్లో అందిస్తు న్న సౌకర్యాలపై అవగాహన కల్పించారు. కా ర్యక్రమంలో ఆయా పాఠశాలల ఉపాధ్యాయు లు ప్రతిభారాణి, సత్యనారాయణ, త్రిశూల్, తల్లిదండ్రులు విద్యార్థులు పాల్గొన్నారు.
గుమ్మడిదల, జూన్ 7 : బడీడు చిన్నారులను ప్రభుత్వ బడిలో చేర్పించాలని ఉపాధ్యాయు లు ఇంటింటి ప్రచారం చేశారు. శుక్రవారం స్థానిక ప్రాథమిక పాఠశాల హెచ్ఎం రాజు ఆధ్వర్యంలో బడిబాట నిర్వహించారు. ఈ సందర్భంగా పాఠశాలలో విద్యార్థులకు ప్రభు త్వం కల్పిస్తున్న సౌకర్యాలను వివరించారు. కార్యక్రమంలో ఉపాధ్యాయులు రామచంద్రారెడ్డి, సుబ్బలక్ష్మి తదితరులుపాల్గొన్నారు.