రామాయంపేట, మే 21 : విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించాలని అప్పుడే ఉపాధ్యాయుడికి పేరు ప్రఖ్యాతలు వస్తాయని రామాయంపేట మండల విద్యాధికారి శ్రీనివాస్ అన్నారు. బుధవారం రామాయం పేటలో రెండవ రోజు ఉపాధ్యాయుల శిక్షణలో మండల విద్యాధికారి ఉపాధ్యాయులకు పలు సూచనలు చేశారు. విద్యార్థులకు సబ్జెక్టుల వారీగా బోధించాలన్నారు. మండలంలోని ప్రతి ప్రభుత్వ పాఠశాలలో ముందస్తుగా బడిబాటను చేపట్టాలన్నారు.
బడిబాటలో విద్యార్థుల తల్లితండ్రుల ఇంటికి వెళ్లి వారి ఇంట్లో బడికి రాని పిల్లలు ఉంటే బడికి పంపాలని చెప్పాలన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లోనే నాణ్యమైన విద్య ఉంటుందని వారికి అర్థమైన రీతిలో చెప్పాలన్నారు. ఈ కార్యక్రమంలో కాంప్లెక్స్ హెచ్ఎంలు, ఆర్పీలు సంతోష్, ప్రవళి, సతీష్, ఉమామహేశ్వర్, నవీన్, శ్రీనివాస్‌రెడ్డి, శ్రీనివాస్, సంతోష్, శంకర్, రాజు, శ్రీకాంత్ ఉన్నారు.