మెదక్, మే 2 : సమస్యల పరిష్కారం కోసమే మీ కోసం నేనున్నా కార్యక్రమాన్ని ఏర్పాటు చేశామని మెదక్ ఎమ్మెల్యే పద్మాదేవేందర్రెడ్డి అన్నారు. మీ కోసం నేనున్నా కార్యక్రమంలో భాగంగా సోమవారం మెదక్ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో మీ కోసం నేనున్నా కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు.
ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ప్రజా సమస్యలను సత్వరమే పరిష్కరించాలనే ఉద్దేశంతో మీ కోసం కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినట్టు ఆమె పేర్కొన్నారు. ఈ కార్యక్రమాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకుంటున్నారని, అధికారులు తమ పరిధిలో లేని సమస్యలను ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించాలని ఆదేశించారు.
సమస్యలను వెంటనే పరిష్కరించాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో మెదక్ ఆర్డీవో సాయిరాం, మున్సిపల్ కమిషనర్ శ్రీహరి, ఆత్మ కమిటీ చైర్మన్ అంజాగౌడ్, వైస్ చైర్మన్ వెంకటనారాయణ, మున్సిపల్ కౌన్సిలర్ జయరాజ్, మార్కెట్ కమిటీ డైరెక్టర్ సాప సాయిలు తదితరులు పాల్గొన్నారు.