ఒక్కటే మరుగుదొడ్డి.. 120 మంది విద్యార్థినులు
వసతి గృహంలో కనీస సౌకర్యాలు లేకపోవడంతో మెదక్ పట్టణంలోని నర్సింగ్ కశాశాల విద్యార్థినులు శుక్రవారం ధర్నా నిర్వహించారు. అనంతరం కలెక్టర్ ప్రతిమాసింగ్కు వినతిపత్రం అందజేశారు. ఎండలో ర్యాలీగా విద్యార్థినులు చమాన్ చౌరస్తా వద్దకు రాగా అధికారులు కల్పించుకొని అక్కడి నుంచి కలెక్టరేట్ వరకు అర్టీసీ బస్సులో తీసుకెళ్లారు.
- సమస్యలు పరిష్కరించాలని మెదక్ నర్సింగ్ కళాశాల విద్యార్థినుల ర్యాలీ
- ఎండలో ర్యాలీగా వెళ్లి మెదక్ కలెక్టర్కు వినతి పత్రం అందజేత
మెదక్ అర్బన్, ఏప్రిల్ 10: వసతి గృహంలో కనీస సౌకర్యాలు లేకపోవడంతో మెదక్ పట్టణంలోని నర్సింగ్ కశాశాల విద్యార్థినులు శుక్రవారం ధర్నా నిర్వహించారు. అనంతరం కలెక్టర్ ప్రతిమాసింగ్కు వినతిపత్రం అందజేశారు. ఎండలో ర్యాలీగా విద్యార్థినులు చమాన్ చౌరస్తా వద్దకు రాగా అధికారులు కల్పించుకొని అక్కడి నుంచి కలెక్టరేట్ వరకు అర్టీసీ బస్సులో తీసుకెళ్లారు. ఈ సందర్భంగా విద్యార్థినులు మాట్లాడుతూ వసతి గృహంలో 120 మంది ఉంటే ఒక మరుగుదొడ్డి, మూత్రశాల ఉండడంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నామన్నారు.
పలుమార్లు ప్రిన్సిపాల్కు సమస్య తెలిపినా పట్టించుకోవడం లేదన్నారు. రాత్రి సమయంలో పాములు గదుల్లోకి వస్తున్నాయని, అధికారులకు తెలిపిన చర్యలు తీసుకోవడం లేదన్నారు. నర్సింగ్ కళాశాలల్లో ప్రవేశం కోసం రూ. 20 వేలు తీసుకుంటున్నారని, వసతి గృహంలో ఉండేందుకు ప్రతి నెల రూ. 6 వేలు చెల్లిస్తున్నామన్నారు. ప్రభుత్వం నుంచి తమకు రావాల్సిన ఉపకార వేతనాలు చెల్లించడం లేదన్నారు. నర్సింగ్ కళాశాలలో ఉన్న సమస్యలు పరిష్కరించేందుకు చర్యలు తీసుకోవాలని కోరారు.
Read Today's Latest Medak News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Harsha Chemudu | ట్రెండింగ్లో ‘లీస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్’.. దర్శకుడికి ఖరీదైన బైక్ బహుమతిగా ఇచ్చిన హర్ష చెముడు!
Jailer 2 | ‘జైలర్ 2’ బాక్సాఫీస్ విధ్వంసం.. తొలి రోజే రూ.125 కోట్లకు పైగా వసూళ్లు!
Regime Change: అధికార మార్పిడి జరగాలన్న ప్రశాంత్ భూషణ్.. ఆ వ్యాఖ్యలను వ్యతిరేకించిన అభిజీత్ దీప్కే
90 Hours Fasting | 90 గంటల పాటు నిరంతరాయంగా ఉపవాసం ఉండడం సాధ్యమేనా.. డాక్టర్లు ఏమంటున్నారు..?
Parliament: డీలిమిటేషన్, వుమెన్స్ కోటా బిల్లులు.. ఈనెలలోనే ప్రత్యేక పార్లమెంట్ సమావేశాలు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

