
మనోహరాబాద్, నవంబర్ 5: రైతులు పండించిన ప్రతిగింజనూ కొనుగోలు చేస్తామని ఎమ్మెల్యే మదన్‌రెడ్డి అన్నారు. శివ్వంపేట మండలం దంతాన్పల్లి, కొంతాన్‌పల్లి, పోతులబొగుడ, పాంబండ, ఉసిరికపల్లి, కొత్తపేట, సీతారాంతండా, రూప్లతండా, రెడ్యాతండా, దొంతి, మగ్దుంపూర్, బీమ్లాతండా, గంగాయిపల్లి గ్రామాల్లో కొనుగోలు కేంద్రాలను ప్రారంభించారు. అనంతరం శివ్వంపేట పోలీస్‌స్టేషన్‌లో హైకోర్టు న్యాయవాది శివకుమార్‌గౌడ్ సహకారంతో ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలను డీఎస్పీ కిరణ్‌కుమార్‌తో కలిసి ప్రారంభించారు. శివ్వంపేట మండలంలోని ఆయా గ్రామాలకు చెందిన 33 మంది లబ్ధిదారులకు కల్యాణలక్ష్మి చెక్కులను అందజేశారు. అనంతరం ఆయన మాట్లాడు తూ… శివ్వంపేటలో పీఏసీఎస్ ఆధ్వర్యంలో 27, ఐకేపీ ఆ ధ్వర్యంలో 5 కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేశామన్నారు. కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ చంద్రాగౌడ్, జడ్పీ కో ఆప్షన్ మెంబర్ మన్సూర్, పీఏసీఎస్ చైర్మన్ వెంకట్రామిరెడ్డి, వైస్ చైర్మన్ వేణుగోపాల్‌రెడ్డి, జడ్పీటీసీ మహేశ్‌గుప్తా, ఎంపీపీ హరికృష్ణ, మండల అధ్యక్షుడు రాజారమణగౌడ్, సర్పంచ్ల ఫోరం మండల అధ్యక్షుడు లావణ్యమాధవరెడ్డి, సీఐ స్వామి, ఎస్సై రవికాంత్‌రావు, తహసీల్దార్ రవికుమార్, ఎంపీడీవో నవీన్‌కుమార్, మండల కో ఆప్షన్ మెంబర్ లాయక్, సర్పంచ్‌లు ఫణిశశాంక్, శ్రీనివాస్‌గౌడ్, ఎంపీటీసీలు పాల్గొన్నారు.
ఝాన్సీలింగాపూర్‌లో కొనుగోలు కేంద్రాన్ని ఏర్పాటు చేయాలి
ఝాన్సీలింగాపూర్‌లో కొనుగోలు కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని ఇఫ్కో డైరెక్టర్ దేవేందర్‌రెడ్డిని సర్పంచ్ జ్యోతి ఆధ్వర్యంలో హైదరాబాద్‌లో దేవేందర్‌రెడ్డి నివాసానికి వెళ్లి కలిశారు. పీఏసీఎస్ ఆధ్వర్యంలోనే కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించాలని కోరారు. ఇఫ్కో డైరెక్టర్ ఝాన్సీలింగాపూర్‌లో కొనుగోలు కేంద్రం ఏర్పా టయ్యేలా కృషి చేస్తానని తెలిపినట్లు సర్పంచ్ జ్యోతి, మాజీ సర్పంచ్ రామకిష్టయ్య, శ్రీనివాస్ విలేకరులకు తెలిపారు.
నాణ్యత ప్రామాణాలు పాటించాలి
రైతులు పండించిన ప్రతిగింజనూ కొనుగోచేస్తామని నార్లాపూర్ సర్పంచ్ అమరసేనారెడ్డి అ న్నారు. రామాయంపేట పీఏసీఎస్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఆయన ప్రారంభించి మాట్లాడారు.దళారుల చేతుల్లో రైతులు మోసపోవద్దనే లక్ష్యంతో ప్రభుత్వం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసిందన్నారు. కార్యక్రమంలో రామాయంపేట పీఏసీఎస్ చైర్మన్ చంద్రం, వార్డు సభ్యులు, రైతులు ఉన్నారు.
రైతులు కొనుగోలు కేంద్రాలకు తరలించే ధాన్యంలో నాణ్యత ప్రామాణాలు పాటించాలని ఏఈవో గణేశ్‌కుమార్ అన్నారు. చల్మెడలోని కొనుగోలు కేంద్రాన్ని ఆయన సందర్శించి రైతులతో మాట్లాడారు.ధాన్యం తేమశాతం 17 లోపు ఉండేట్లు ఆరబెట్టి,సిబ్బందికి సహకరించాలని రైతులకు సూచించారు.కార్యక్రమంలో రైతులు ఉన్నారు.
మండల పరిధిలో ..
మండల పరిధిలోని నార్సింగిలో సర్పంచ్ ప్రమీల కొనుగోలు కేంద్రం ప్రారంభించగా , రా మతీర్థం ,మల్లంపేట గ్రామాల్ల్లో సొసైటీ చైర్మన్ మోహన్‌రెడ్డి ప్రారంభించారు. కార్యక్రమంలో ఏడుపాయల మాజీ చైర్మ న్ గోపాల్ రెడ్డి, బాపు రెడ్డి, షాహిద్ పాషా ,అంటోని. సాయిరెడ్డి ,దుర్గరెడ్డి పాల్లొన్నారు.
టేక్మాల్‌లో…
రైతులు పండించిన ధాన్యాన్ని కొనుగోలు చేసేందుకు మండలంలోని పలు గ్రామాల్లో కొనుగోలు కేంద్రాలను ప్రారంభించారు. ఐకేపీ ఆధ్వర్యంలో టేక్మాల్, ఎల్లుపేట, సూరంపల్లి, అచ్చన్నపల్లి గ్రామాల్లో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో రైతులు ధా న్యాన్ని విక్రయించుకోవాలని సూచించారు. కార్యక్రమంలో ఎంపీపీ స్వప్న, ఆయా గ్రామాల సర్పంచ్‌లు సుప్రజ, సాయిలు, రం జానాయక్, ఎంపీటీసీలు వాణి, సురేందర్‌రెడ్డి, కో ఆప్షన్ స భ్యుడు మహజర్, తహసీల్దార్ గ్రేసీబాయి, ఏవో రాంప్రసాద్, ఉన్నారు.
మండల పరిధిలోని గ్రామాల్లో…
రైతుల కోసమే కొనుగోలు కేంద్రాలను ప్రభుత్వం ఏర్పాటు చేసిందని టీఆర్ఎస్ మం డల అధ్యక్షుడు శ్రీనివాస్‌రెడ్డి అన్నారు. మండల పరిధిలోని కొచ్చెరుతండా, ఔరంగాబాద్తండా, లింగ్సాన్‌పల్లి తండాలో కొనుగోలు కేంద్రాలను ఆయన ప్రారంభించారు. కార్యక్రమంలో సర్పంచ్‌లు రమేశ్,ఫూల్సింగ్, ఎంపీటీసీ మంగ్యా, గిరిజనులు, శంకర్‌నాయక్ పాల్గొన్నారు.
దామరచెర్వు, కాట్రియాలల్లో…
ప్రభుత్వం రైతుల కోసం ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాలను సద్వినియోగం చేసుకోవాలని పీఏసీఎస్ చైర్మన్ చంద్రం రైతులకు సూచించారు. మండల పరిధిలోని దామరచెర్వు, కాట్రియా ల, లక్ష్మాపూర్, పర్వతాపూర్ గ్రామాల్లో కొనుగోలు కేంద్రాలను పీఏసీఎస్ చైర్మన్ చంద్రం, ఎంపీపీ భిక్షపతితో కలిసి ప్రారంభించారు. కార్యక్రమంలో సర్పంచ్‌లు పడాల శివప్రసాద్‌రావు, బోయిని దయాలక్ష్మి, సుభాశ్, శ్యాములు,ఎంపీటీసీలు శ్రీలత చంద్రశేఖర్‌రావు, నాగులు, ఉప సర్పంచ్‌లు దండు రమేశ్, కొత్త శ్రవంతి, సొసైటీ డైరెక్టర్లు, సొసైటీ సీఈవో నర్సింహులు పాల్గొన్నారు
నర్సాపూర్‌లో…
ధాన్యం విషయంలో రైతులు తప్పనిసరిగా నాణ్యత ప్రమాణాలను పాటించాలని జిల్లా వ్యవసాయాధికారి పరశురాం నాయక్ అన్నారు. మండల పరిధిలోని పెద్దచింతకుంటలో ఏర్పాటు చేసి కొనుగోలు కేంద్రాన్ని జిల్లా వ్యవసాయాధికారి పరశురాం నాయక్ సందర్శించారు.
వెల్దుర్తిలో..
మండలంలోని పలు గ్రామాల్లో ధాన్యం కొనుగోళ్లు ప్రారంభం మయ్యాయి. రెండు రోజుల క్రితం కొనుగోలు కేంద్రాలు ప్రారంభం కాగా హామాలీల ఇబ్బందితో పాటు బుధవారం సాయంత్రం కురిసిన వర్షానికి ధాన్యం తేమ పట్టడంతో శుక్రవారం కొనుగోళ్లను ప్రారంభించినట్లు సొసైటీ సీఈవో సిద్ధ్దయ్య తెలిపారు.