
చేగుంట, నవంబర్ 5: ప్రభుత్వం ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాలను రైతులు సద్వినియోగం చేసుకోవాలని ఎమ్మెల్యే ర ఘునందన్‌రావు అన్నారు. మండల పరిధిలోని గ్రామాల్లో ఐకే పీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాలను ఎమ్మె ల్యే రఘునంధన్‌రావు స్థానిక నాయకులతో కలిసి ప్రారంభించారు. కార్యక్రమంలో మార్కెట్‌కమిటీ చైర్మన్ రజనక్ప్రవీణ్కుమార్, సర్పంచులు స్వర్ణలత, కుమ్మరి శ్రీనివాస్, దొంతిరెడ్డి ఎల్లారెడ్డి, సంతోష, రాములు, వెంకటేశంగారి లక్ష్మీ, వైస్ ఎం పీపీ మున్నూర్ రాంచద్రం, ఎంపీటీసీలు బండి కవిత, బింగి గణే ష్, బెదరబోయిన భాగ్యమ్మ, హోళియనాయక్, తహసీల్దార్ విజయలక్ష్మి, ఎంపీడీవో ఉమాదేవి, ఐకేపీ ఏపీఎం లక్ష్మీనర్సమ్మ, రైతు బంధు జిల్లా డైరెక్టర్ మోహన్‌రెడ్డి, మండల రైతు బంధు అధ్యక్షుడు శ్రీనివాస్, ఐకేపీ సీసీలు అంజ్యానాయక్, స్వామి, రామస్వామి,మహిళ సంఘాల సభ్యులు ఉన్నారు..
సొసైటీ ఆధ్వర్యంలో …
మండల పరిధిలోని ఇబ్రహీంపూర్ సొసైటీ ఆధ్వర్యంలో బోనాల్, పెద్దశివునూర్తో పాటు పలు గ్రామాల్లో కొనుగోలు కేంద్రాలను సొసైటీ చైర్మన్ కొండల్‌రెడ్డి ప్రారంభించారు. కార్యక్రమంలో సర్పంచ్ రుక్మిణిబాయి, వైస్ చైర్మన్ పట్నం తా నిషా, సీవోలు శ్రీనివాస్, సంతోశ్‌కుమార్ రైతులు పాల్గొన్నారు.