మెదక్ : జిల్లాలో రెండు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు మెదక్ పట్టణంలోని మిల్ట్రీ కాలనీకి చెందిన మహ్మద్ సర్వర్ ఇల్లు గురువారం కూలిపోయింది. ఈ ప్రమాదంలో గాయపడ్డ మాహ్మద్ సర్వర్ కూతురు యాస్మిన్ బేగం గాయపడింది. విషయం తెలుసుకున్న మెదక్ ఎమ్మెల్యే పద్మాదేవేందర్రెడ్డి తక్షణం స్పందించారు.
హైదరాబాద్లో ఓ హాస్పిటల్ చికిత్స పొంతుతుండగా యాజమాన్యంతో మాట్లాడి వైద్య ఖర్చుల పూర్తి బాధ్యత తాను తీసుకుంటానని వెంటనే మెరుగైన చికిత్స అందించాలని చెప్పారు. అలాగే ప్రభుత్వం తరపున వైద్య ఖర్చులకు ఎల్ఓసీఈ మంజూరు చేయిస్తానని హామీ ఇచ్చారు. సర్వర్ కుటుంబ సభ్యుల అండగా ఉంటానని, అధైర్యపడవద్దన్నారు. కూలిన ఇంటి స్థానంలో నూతన ఇల్లు మంజూరు చేస్తానని హామీనిచ్చారు.