ప్రభుత్వ బడులకు మహర్దశ
‘మన ఊరు-మనబడి’ తో ప్రభుత్వ పాఠశాలలకు మహర్దశ వచ్చిందని, ప్రైవేటు పాఠశాలలకు దీటుగా ప్రభుత్వ బడులను తీర్చిదిద్దుతున్నట్లు మెదక్ ఎమ్మెల్యే, బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షురాలు పద్మాదేవేందర్‌రెడ్డి పేర్కొన్నారు
- ప్రైవేటుకు దీటుగా సర్కారీ పాఠశాలలు
- మెదక్ ఎమ్మెల్యే పద్మాదేవేందర్‌రెడ్డి
- మల్లుపల్లిలో అదనపు తరగతి గది నిర్మాణ పనులకు శంకుస్థాపన
చిన్నశంకరంపేట, డిసెంబర్ 23 : ‘మన ఊరు-మనబడి’ తో ప్రభుత్వ పాఠశాలలకు మహర్దశ వచ్చిందని, ప్రైవేటు పాఠశాలలకు దీటుగా ప్రభుత్వ బడులను తీర్చిదిద్దుతున్నట్లు మెదక్ ఎమ్మెల్యే, బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షురాలు పద్మాదేవేందర్‌రెడ్డి పేర్కొన్నారు.
చిన్నశంకరంపేట మండలం మల్లుపల్లిలో ప్రభు త్వ పాఠశాలలో రూ.10లక్షలతో నిర్మించనున్న అదనపు తర గతి గది నిర్మాణ పనులకు శుక్రవారం శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే పద్మాదేవేందర్‌రెడ్డి మాట్లాడుతూ విద్యార్థుల సంక్షేమానికి ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు. ప్రజా సంక్షే మమే ప్రభుత్వ ధ్యేయమన్నారు. మెదక్ నియోజక వర్గంలో ఆసరా పథకం ద్వారా 52,000 మందికి పింఛన్లు ఇస్తున్నట్లు పేర్కొన్నారు. రైతు సంక్షేమానికి సీఎం కేసీఆర్ రైతుబంధు, రైతుబీమా పథకాలను అమలు చేస్తున్నారని తెలిపారు.
కార్యక్రమంలో ఎంపీపీ ఆవుల భాగ్యలక్ష్మి, రైతుబంధు సమితి మం డలాధ్యక్షుడు లక్ష్మారెడ్డి, ఎంపీడీవో గణేశ్‌రెడ్డి, బీఆర్ఎస్ మం డలాధ్యక్షుడు పట్లోరి రాజు, సర్పంచ్‌లు చిట్కుల లక్ష్మీరాజిరెడ్డి, సిద్ధిరాంరెడ్డి, దయానంద్‌యాదవ్, సింగిల్‌విండో చైర్మన్ అంజిరెడ్డి, మాజీ చైర్మన్ గోపాల్‌రెడ్డి, నాయకులు శంకరయ్య, రవీందర్, శ్రీనివాస్, వివిధ గ్రామాల ఎంపీటీసీలు పాల్గొన్నారు.
నిధులు ఇవ్వాలి : వైస్ ఎంపీపీ రాధాకిషన్‌యాదవ్
హవేళీఘనపూర్, డిసెంబర్ 23 : మండలంలోని సర్దన- కామారెడ్డి జిల్లా మల్తుమ్మెదకు బ్రిడ్జి నిర్మాణంతోపాటు సర్ధన గ్రామంలో సీసీరోడ్లకు నిధులు మంజూరు చేయాలని ఎమ్మెల్యే పద్మాదేవేందర్‌రెడ్డిని వైస్ ఎంపీపీ రాధాకిషన్‌యాదవ్ కోరారు. ఆయన వెంట బీఆర్ఎస్ టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు శ్రీనివాస్‌రెడ్డి, నాయకులు సతీశ్‌రావు, రాజేశ్వరరావు ఉన్నారు.
Read Today's Latest Medak News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

