సిద్దిపేట అర్బన్, జూలై 14 : సైబర్ నేరాలపై ప్రజలకు అవగాహన కల్పించాలని సిద్దిపేట సీపీ శ్వేత అన్నారు. గురువారం సిద్దిపేట పోలీస్ కమిషనరేట్‌లో హుస్నాబాద్ డివిజన్ పోలీస్ అధికారులతో పెండింగ్ కేసులపై సమీక్షా సమావేశం నిర్వహించారు. పెండింగ్‌లో ఉన్న కేసుల్లో గ్రేవ్, నాన్ గ్రేవ్ కేసుల గురించి ఏపీసీ, సీఐ, ఎస్సైలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా సీపీ మాట్లాడుతూ 2020, 2021 సంవత్సరాల్లో పరిశోధనలో ఉన్న కేసులను త్వరగా పరిష్కరించాలని సూచించారు. పోక్సో, ఎస్సీ, ఎస్టీ గ్రేవ్ కేసుల్లో త్వరితగతిన ఇన్వెస్టిగేషన్ పూర్తిచేసి కోర్టులో చార్జిషీట్ దాఖలు చేయాలన్నారు. క్రైం అగైనెస్ట్ ఉమెన్ కేసుల్లో త్వరితగతిన పరిశోధన పూర్తి చేసి, కోర్టులో చార్జిషీట్ దాఖలు చేయాలన్నారు. ఠాణాల్లో 5ఎస్ పకడ్బందీగా అమలు చేయాలని సూచించా రు. పోలీస్ అధికారి నెలనెలా క్రైం రిపోర్ట్‌ను ప్రతిరోజు మానిటర్ చేయాలన్నారు. కేడీ, డీసీ, సస్పెక్ట్స్, రౌడీల బయోడేటాను టీఎస్ కాప్‌లో పొందుపర్చాలన్నారు. రౌడీలు, కేడీ లు, సస్పెక్ట్స్, సంఘ విద్రోహ శక్తుల కదలికలపై నిరంతరం నిఘా పెట్టాలన్నారు. నాన్ బెయిలబుల్ వారెంట్ త్వరగా ఎక్జిక్యూట్ చేయాలన్నారు. పోక్సో, ఎస్సీ, ఎస్టీ కేసుల్లో 60 రోజుల్లో ఇన్వెస్టిగేషన్ పూర్తి చేసి చార్జిషీట్ దాఖలు చేయాలన్నారు. సైబర్ నేరాల్లో త్వరితగతిన పరిశోధన పూర్తి చేయాలని తెలిపారు. దొంగతనాల కేసుల్లో ప్లాన్ ఆఫ్ యాక్షన్, ఎస్ఓపీ ప్రకారం ఇన్వెస్టిగేషన్ చేసి కేసులను ఛేదించాలని సూచించారు. క్రైం వర్టికల్, టెక్ టీం, స్టేషన్ రైటర్, కోర్టు డ్యూటీ ఆఫీసర్, వర్టికల్ విధులు నిర్వహించే అధికారులు, సిబ్బందికి శిక్షణా తరగతులు నిర్వహించాలన్నారు. విధి నిర్వహణలో గోల్ క్లారిటీ ప్రతిఒక్కరికీ తెలిసి ఉండాలని సూచించారు. సమీక్షా సమావేశంలో అడిషనల్ డీసీపీ అడ్మిన్ మహేందర్, హుస్నాబాద్ ఏసీపీ సతీశ్, ట్రాఫిక్ ఏసీపీ ఫణీందర్, సీఐలు రఘుపతిరెడ్డి, శ్రీనివాసులు, హుస్నాబాద్ డివిజన్ ఎస్సైలు, ఇతర అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.
దరఖాస్తుదారుడితో మర్యాదగా ప్రవర్తించాలి
సిద్దిపేట అర్బన్, జూలై 14 : దరఖాస్తు నుంచి చార్జిషీట్ వరకు అన్ని వివరాలను సీసీటీఎన్ఎస్లో పొందుపర్చాలని సిద్దిపేట సీపీ శ్వేత తెలిపారు. గురువారం పోలీస్ కమిషనరేట్‌లో స్టేషన్ రైటర్లకు జరిగిన వారం రోజుల శిక్షణా కార్యక్రమంలో పాల్గొని మాట్లాడారు. దరఖాస్తు నుంచి చార్జిషీట్ వరకు ఎస్ఓపీ ప్రకారం ఇన్వెస్టిగేషన్ ఉండాలని, ఇన్వెస్టిగేషన్లో ఎలాంటి లోటుపాట్లు ఉండొద్దన్నారు. క్రైం రివ్యూ ప్రతినెలా 3వ తేదీ లోపు కమిషనర్ కార్యాలయానికి పంపించాలన్నారు. పోలీస్ స్టేషన్‌కు వచ్చే దరఖాస్తుదారుడితో మర్యాదగా మాట్లాడాలన్నారు. ప్రతినెలా డీజీపీ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా రాష్ట్రస్థాయిలో రివ్యూ చేయనున్నట్లు చెప్పా రు. యూఐ కేసులు తగ్గించే విధంగా చర్యలు తీసుకోవాలన్నారు. టార్గెట్ పెట్టిన కేసులను తప్పకుండా పూర్తి చేయాలని తెలిపారు. దొంగతనం కేసుకు సంబంధించిన నేర స్థలం, రోడ్డు ప్రమాదం జరిగిన స్థలాన్ని జియోట్యాగింగ్ మ్యాపింగ్ తయా రు చేసి సీసీటీఎన్ఎస్ సిస్టంలో అప్లోడ్ చేయాలని సూచించారు. రోడ్డు ప్రమాద కేసుల్లో ఫామ్ 54 పూర్తి చేసి పెం డింగ్ ఉన్నవాటిని అప్లోడ్ చేయాలన్నారు. పోక్సో, క్రైం అగైనెస్ట్ ఉమెన్, ఎస్సీ, ఎస్టీ కేసుల్లో శిక్ష శాతం మానిటర్ చేయనున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో హుస్నాబాద్ ఏసీపీ సతీ శ్, ఐటీ సెల్ ఎస్సై శ్రీకాంత్, ఆర్ఎస్ఐ వెంక టరమణ పాల్గొన్నారు.