నర్సాపూర్, సెప్టెంబర్ 14 : తెలంగాణ జాతీయ సమైఖ్య తా వజ్రోత్సవాల్లో భాగంగా ఈ నెల 16న నిర్వహించే ర్యాలీ లో ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొని జాతీయ స్ఫూర్తిని చా టాలని ఎమ్మెల్యే మదన్‌రెడ్డి పిలుపునిచ్చారు. బుధవారం నర్సాపూర్ ఆర్డీవో కార్యాలయంలో ఆర్డీవో వెంకటఉపేందర్ రెడ్డి అధ్యక్షతనలో తెలంగాణ వజ్రోత్సవాలపై ఎమ్మెల్యేతోపా టు అదనపు కలెక్టర్ ప్రతిమాసింగ్ హాజరై అధికారులతో సమీ క్ష నిర్వహించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మదన్‌రెడ్డి మా ట్లాడుతూ.. ఈ నెల 16న వజ్రోత్సవ ర్యాలీ నిర్వహించి, పట్ట ణ శివారులోని అల్లూరి సీతారామరాజు గిరిజన గురుకుల పాఠశాలలో 15వేల మందితో భారీ సభను నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ ర్యాలీ నర్సాపూర్ ఎంపీడీవో కార్యాలయం సమీపం నుంచి గురుకుల పాఠశాల వరకు సుమారు కిలో మీటర్ కొనసాగుతుందన్నారు. తెలంగాణ ప్రాంతం భారతదేశంలో కలిసి 75 ఏండ్లు పూర్తైన సందర్భంగా వజ్రోత్సవాలను నిర్వహిస్తున్నట్లు వివరించారు.
ఈ నెల 17న ప్రభుత్వ కార్యాలయాల్లో జాతీయ జెండాను ఆవిష్కరించాలని ఆదేశిం చారు. 17న మధ్యాహ్నం హైదరాబాద్‌లో సీఎం కేసీఆర్ నిర్వహిస్తున్న సభకు అన్ని గ్రామాల నుంచి ప్రజలు పెద్ద సంఖ్యలో తరలిరావాలని కోరారు. సమీక్షలో తూప్రాన్ డీఎస్పీ యాదగిరి, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ చంద్రాగౌడ్, సీఐ షేక్‌లాల్ మధార్, ఎంపీపీలు, జడ్పీటీసీలు పాల్గొన్నారు.