పెద్దశంకరంపేట, సెప్టెంబర్ 14 : ప్రతి గ్రామంలో అర్హులైన ప్రతి ఒక్కరికీ ఆసరా పింఛన్లు అందజేస్తామని, ప్రతి ఒక్క రూ ప్రభుత్వ సంక్షేమ పథకాలను సద్వినియోగం చేసుకోవాలని నారాయణఖేడ్ ఎమ్మెల్యే భూపాల్‌రెడ్డి అన్నారు. బుధవారం మండలంలోని కోళ్లపల్లి, ఇస్కపాయల తండా, కట్టెల వెంకటాపురం, ఉత్తులూరు, రామోజిపల్లి, కొత్తపేట తదితర గ్రామాల్లో పింఛన్ కార్డులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. ప్రభుత్వం 57 ఏండ్లు దాటిన ప్రతి ఒక్కరికీ పింఛన్లు మంజూరు చేసిందన్నారు. ప్రభుత్వం అన్ని వర్గాల ప్రజలకు అండగా ఉంటుందని, బంగారు తెలంగాణ లో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని కోరారు.
వివిధ గ్రామాల్లో ఎమ్మెల్యే భూపాల్‌రెడ్డి పర్యటించి, పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేశారు. ఇస్కపాయల తండాలో రూ.10 లక్షలతో కమ్యూనిటీ హాల్, 10 లక్షల సీసీ రోడ్లు, మురుగు కాల్వల నిర్మాణానికి భూమిపూజ చేశారు. కోళ్లపల్లిలో రూ.15 లక్షలతో సీసీ రోడ్లు, రూ.5 లక్షలతో ముదిరాజ్ కమ్యూనిటీ హాల్ పనులకు భూమిపూజ చేశారు.
గొట్టిముక్కుల గ్రామంలో టీఆర్ఎస్ కార్యకర్త మణెమ్మ ఇటీవల మృతి చెందింది. ఈ మేరకు మృతురాలి కుటుంబ సభ్యులకు రూ.2 లక్షల ప్రమాదబీమా చెక్కును ఎమ్మెల్యే భూ పాల్‌రెడ్డి అందజేశారు. కార్యక్రమంలో ఎంపీపీ శ్రీనివాస్, వైస్‌ఎంపీపీ లక్ష్మీరమేశ్, రైతుబంధు మండలాధ్యక్షుడు సురేశ్‌గౌడ్, నాయకులు వేణుగోపాల్‌గౌడ్, నర్సింహులు, సుభాశ్, భాను, శంకర్‌గౌడ్, ఎంపీడీవో రియాజొద్దీన్ పాల్గొన్నారు.
వెల్దుర్తి, సెప్టెంబర్ 14 : పేదలలకు సీఎం కేసీఆర్ పింఛన్ అందజేసి, అండగా నిలుస్తున్నారని ఎంపీపీ స్వరూపానరేందర్రెడ్డి, జడ్పీటీసీ రమేశ్‌గౌడ్, టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు భూపాల్‌రెడ్డి అన్నారు. మంగళపర్తి గ్రామంలో 68 మంది లబ్ధ్దిదారులకు ఆసరా పెన్షన్ పత్రాలను సర్పంచ్ రామకృష్ణారావు, ఎంపీటీసీ అడివయ్యతో కలిసి అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. టీఆర్ఎస్ హయాంలోనే ప్రతి ఇంటికీ సంక్షేమ పథకాలు, అభివృద్ధి ఫలాలు అందుతున్నాయన్నారు.
అన్ని వర్గాలు ప్రజలకు న్యాయం జరిగేలా పథకాలను అమలు చేస్తూ సీఎం కేసీఆర్ దేశానికే ఆదర్శంగా నిలుస్తున్నారని పేర్కొన్నారు. ప్రతినెలా బ్యాంకు ఖాతాలో నేరుగా పింఛన్ నగదు జమ అవుతుంటే లబ్ధిదారుల కళ్లల్లో ఆనందం వెల్లివిరుసున్నదన్నారు. టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని ప్రజలు ఆదరించి, ఆశీర్వదించాలన్నారు. కార్యక్రమంలో తహసీల్దార్ సురేశ్, ఎంపీడీవో జగదీశ్వరాచారి, నాయకులు నరేందర్‌రెడ్డి, గొల్ల శ్రీను, వార్డు సభ్యులు, కార్యదర్శి పాల్గొన్నారు.