మెదక్, సెప్టెంబర్ 13 (నమస్తే తెలంగాణ): జాతీయ సమైక్యతా వజ్రోత్సవాల్లో భాగంగా ఈ నెల 16న మెదక్ నియోజకవర్గంలో నిర్వహించే ర్యాలీ, సభను విజయవంతం చేయా డానికి అధికారులు ప్రణాళికబద్ధంగా సమన్వయంతో పని చేయాల్సిందిగా జిల్లా అదనపు కలెక్టర్ రమేశ్ మంగళవారం అధికారులను ఆదేశించారు. పట్టణంలో ఉదయం 11గంటలకు స్థానిక మున్సిపల్ కార్యాలయం నుంచి జూనియర్ కళాశాల వరకు 15వేల మందితో ర్యాలీ నిర్వహిస్తున్నామన్నారు. నియోజకవర్గంలోని అన్ని మండలాల నుంచి ఎస్టీ స్వయం సహాయక సంఘాల సభ్యులను ర్యాలీలో పాల్గొనేలా చూడాలని మండల పరిషత్ అధికారులకు సూచించారు. వాహనాల పార్కింగ్, బారీ కేడింగ్ పనులు చూడాల్సిందిగా ఆర్అండ్బీ ఈఈని ఆదేశించారు. సభ అనంతరం పాల్గొన్న అందరికీ భోజనం, తాగునీటి సదుపాయం ఏర్పాటు చేయాల్సిందిగా ఆర్డీవోకు సూచించారు. 17న జాతీయ పతాకావిష్కరణ అనంతరం ఎస్టీ ప్రజాప్రతినిధులు, స్వయం సహాయ క సభ్యులను హైదరాబాద్‌కు పంపుటకు అవసరమైన బస్సులను సమకూర్చి పం పాలని జిల్లా రవాణాధికారికి సూచించా రు. ట్రాఫిక్‌కు అంతరాయం కలగకుండా పోలీసులు చర్యలు చేపట్టాలని డీఎస్పీని కోరారు. కార్యక్రమంలో డీఎస్పీ సైదులు, ఆర్డీవో సాయిరాం, ఆర్అండ్బీ ఈఈ శ్యాంసుందర్, జిల్లా సైన్స్ అధికారి రాజిరెడ్డి, మండ ల పరిషత్ అధికారులు, తహసీల్దార్ శ్రీని వాస్ పాల్గొన్నారు.
ధాన్యాన్ని గోదాములకు తరలించాలి
2021-22 వానకాలం సంబంధించి పెండింగ్‌లో ఉన్న లక్షా 58వేల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని మిల్లింగ్ చేసి వెంటనే సనత్‌నగర్ ఎస్సీఐ గోదాముకు పంపాల్సిందిగా అదనపు కలెక్టర్ రమేశ్ రైస్‌మిల్లుల యాజమాన్యాన్ని కోరారు. మంగళవా రం కలెక్టరేట్లోని ప్రజావాణిలో రైస్‌మిల్లర్లతో ఏర్పాటు చేసి న సమావేశంలో ఆయన మాట్లాడుతూ ధాన్యం తరలింపునకు అవసరమైన గన్నీ బ్యాగులను సమకూరుస్తామని, వెం టనే ధాన్యాన్ని మిల్లింగ్ చేసి సనత్‌నగర్‌లోని గోదాములకు తరలించాలని సూచించారు. వానకాలం పంటలో ఐదున్నర లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం వచ్చే అవకాశముందని అందుకనుగుణంగా మిల్లుల సామర్థ్యాన్ని పెంచుకొని పోర్టిఫైడ్ యంత్రాలను అమర్చుకోవాలని సూచించారు. ఇటీవల కురిసిన భారీ వర్షాలకు మిల్లుల ఆవరణలో నిలువ ఉంచిన ధాన్యం పాడయిందని, ఎంత నష్టం వాటిల్లిందో అంచనా వేసి ప్రభుత్వానికి నివేదిక పంపి రైస్‌మిల్లర్లను ఆదుకోవాలని జిల్లా రైస్‌మిల్లర్ల అధ్యక్షుడు చంద్రపాల్ కోరారు. కార్యక్రమంలో పౌర సరఫరాల శాఖ జిల్లా మేనేజర్ గోపాల్, అధికారి శ్రీనివాస్, రైస్ మిల్లర్ల యజమానులు పాల్గొన్నారు.