పెద్దశంకరంపేట, సెప్టెబర్ 12: పెద్దశంకరంపేట మండ లం లో నవరాత్రి ఉత్సవాల ముగింపు ఉత్సవాలు సోమవా రం కూడా కొనసాగాయి. నిమజ్జనాన్ని కన్నుల పండువగా నిర్వహించారు. పట్టణంలో బజారంగ్దళ్ ఆధ్వర్యంలో ఏర్పా టు చేసిన వినాయకుడితో పాటు పలు వినాయకులని అందం గా అలంకరించిన ప్రత్యేక వాహనాల్లో వినాయక విగ్రహాలను ఉంచి పట్టణ పురవీధుల గుండా ఊరేగించారు. తిరుమలాపురం చెరువులో నిమజ్జనం చేశారు.
నిజాంపేట,సెప్టెంబర్ 12 : మండల వ్యాప్తంగా గణేశ్ నిమజ్జనలు కొనసాగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా గణనాథులకు మండప నిర్వాహకులు, భక్తులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. దాతలు అన్నదాన కార్యక్రమాలను ఏర్పాటు చేశా రు. నిజాంపేటలో సోమవారం మండపాల నిర్వాహకులు, యూత్ సభ్యులు గణనాథులను నిమజ్జనం చేయడానికి స్థానికంగా ఉన్న మల్కచెరువుకు తరలించారు.
రామాయంపేట, సెప్టెంబర్ 12: రామాయంపేట పట్టణం తో మండలంలోని ఝాన్సిలింగాపూర్, కోనాపూర్, గొల్పర్తి, కోమటిపల్లి గ్రామాల్లోని వినాయకుల శోభాయాత్రలు ఘనం గా వెళ్తున్నాయి. సోమవారం మండలంలోని ఝాన్సిలింగాపూర్ గ్రామంలోని వినాయకుడిని గ్రామస్తులు, గ్రామ మాజీ సర్పంచ్ రామకిష్టయ్య, సర్పంచ్ పంబాల జ్యోతిలు వినాయకుడిని ఎడ్ల బండిపై ఊరేగింపు నిర్వహించారు. రామాయంపేటలోని ఆర్యవైశ్య భవన్లో జరిగిన వేలం పాటలో గణపతి లడ్డూను రూ. 90వేలకు వేలం పాట నిర్వహించారు. వేలం పాటలో గజవాడ కాశీనాథం లడ్డూను దక్కించుకున్నారు.
చేగుంట, సెప్టెంబర్12: చేగుంట, నార్సింగి మండలంలో ని పలు గ్రామాల్లో గణనాథులు శోభయాత్రను భక్తిశ్రద్ధలతో నిర్వహిస్తున్నారు. చేగుంటలోని వాసవి కన్యకాపరమేశ్వరి దేవాలయంలో వినాయకుడి నిమజ్జనం శోభయమానంగా జరిగింది.