మెదక్ మున్సిపాలిటీ/మెదక్ రూరల్, సెప్టెంబర్ 12 : ఆదిదేవుడు గణనాథుడికి భక్తులు ఘనంగా వీడ్కోలు పలికారు. 11 రోజులపాటు పూజలందుకుందుకున్న గణనాథుడు గంగమ్మ ఒడికి చేరాడు. జిల్లా కేంద్రం మెదక్‌లో శనివారం అర్ధరాత్రి నుం చి ప్రారంభమైన నిమజ్జన శోభాయాత్ర ఆదివారం సాయంత్రం వరకు కొనసాగింది. బంగాళఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో శనివారం నుంచి ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్త్తూనే ఉంది. వర్షంలో సైతం వినాయక నిమజ్జనాన్ని జిల్లాకేంద్రంలో ప్రశాంత వాతావరణంలో నిర్వహిం చారు.
పట్టణంలో సుమారు 200లకు పైగా వినాయకులను ప్రతిష్ఠించగా కొన్నింటిని ఐదు రోజులు, మరికొన్ని తొమ్మిది రోజులకు నిమజ్జనం చేయగా.. మిగతావి శనివారం అర్ధ్దరాత్రి నుంచి నిమజ్జనానికి తరలాయి. ఆదివారం సాయంత్రం వరకు జరిగిన వందకు పైగా విగ్రహాలను నిమజ్జనం చేశారు. ఆదివారం తెల్లవారుజామున నుంచి పెద్దబజార్, కోలిగడ్డ, కుమ్మరిగడ్డ, నవాబుపేట, మార్కె ట్, చమన్, ఫతేనగర్, దాయర, బ్రాహ్మణవీధిలోని గణనాథు లు శివ్వబెల్లయ్య చౌరస్తా, చమన్ల మీదుగా రాందాస్ చౌరస్తాకు చేరుకున్నాయి. అజాంపురా, శాంతినగర్, నర్సీఖేడ్, గో ల్కొండ వీధుల్లోని గణనాథులు పాత బస్టాండ్ మీదుగా రాం దాస్ చౌరస్తాకు చేరుకున్నాయి.
మున్సిపల్ పాలకవర్గం ఏర్పా టు చేసిన స్వాగత వేదిక వద్ద గణనాథులకు ఎమ్మెల్యే పద్మాదేవేందర్‌రెడ్డి, మున్సిపల్ చైర్మన్ చంద్రపాల్, కమిషనర్ శ్రీహరి, కౌన్సిలర్లు స్వాగతం పలికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. మండపాల నిర్వాహకులకు జ్ఞాపికలు అందజేశారు. అనంతరం రాందాస్ చౌరస్తా నుంచి పాత బస్టాండ్, గోల్కొండ వీధి, ఆటోనగర్ మీదుగా కొంటూర్ చెరువు తీసుకెళ్లి నిమజ్జనం చేశారు. కొన్ని విగ్రహాలను పట్టణంలోని గొసంద్రం, బంగ్లా చెరువుతోపా టు ఎంఎన్ కెనాల్లో నిమజ్జనం చేశారు. ఈ సందర్భంగా ఏఎస్పీ కృష్ణమూర్తి, డీఎస్పీ సైదులు ఆధ్వర్యంలో 200 మందికిపైగా పోలీసులతో బందోబస్తు ఏర్పాటు చేశారు.
ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో అల్పాహారం..
ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో శనివారం అర్దరాత్రి నుంచి ఆదివారం మధ్యాహ్నం వరకు భక్తులకు అల్పహారాన్ని పంపిణీ చేశారు. ఏడేండ్లుగా అల్పహారాన్ని పంపిణీ చేస్తున్నట్లు ఆర్యవైశ్య సంఘం నాయకులు, మున్సిపల్ చైర్మన్ చంద్రపాల్ తెలిపారు. పద్మాద్వేందర్రెడ్డి స్వయంగా భక్తులకు వడ్డించారు.
సీఎం కేసీఆర్ ఆశీస్సులతో అభివృద్ధి చేస్తా..
ఎమ్మెల్యే పద్మాదేవేందర్‌రెడ్డి
ప్రజలందరూ సుఖశాంతులతో ఉండాలని గణనాథుడిని వేడుకున్నట్లు ఎమ్మెల్యే పద్మాదేవేందర్‌రెడ్డి తెలిపారు. నిమజ్జన కార్యక్రమానికి హాజరైన ఎమ్మెల్యే రాందాస్ చౌరస్తాలో గణనాథుడికి పూజలు నిర్వహించి నిర్వాహకుల జ్ఞాపికలను అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ఈ యేడు వర్షా లు సమృద్ధ్దిగా కురిసి, చెరువులు, కుం టలు నిండాయని, సీఎం కేసీఆర్ ఆశీస్సులతో జిల్లాను అభివృద్ధి చేస్తానన్నారు. వర్షంలో యువకులు, విద్యార్థులు సాం ప్రదాయ వస్త్రధారణలతో డప్పుచప్పుళ్లకు నృత్యాలు చేస్తూ శోభాయాత్ర నిర్వహించారు. నిమజ్జనోత్సవంలో మున్సిపల్ కమిషనర్ శ్రీహరి, మాజీ వైస్ చైర్మన్ రాగి అశోక్, మార్కెట్ కమిటీ చైర్మన్ జగపతి, కౌన్సిలర్లు లక్ష్మీనారాయణగౌడ్, ఆంజనేయులు, జయరాజ్, కిశోర్, శ్రీనివాస్, ఆత్మ కమిటీ వైస్ చైర్మన్ వెంకటనారాయణ, ఏఎంసీ డైరెక్టర్ శంకర్, టీఆర్ఎస్ పటణాధ్యక్షుడు గంగాధర్, టీఆర్ఎస్ నాయ కులు లింగారెడ్డి, శ్రీధర్‌యాదవ్, ప్రభురెడ్డి, దుర్గాప్రసాద్, శివరామకృష్ణ, శ్రీనివాస్, ఉమర్, ముజీబ్ పాల్గొన్నారు.
రాష్ట్రం సుభిక్షంగా ఉండాలి
ఎమ్మెల్యే మదన్‌రెడ్డి
శివ్వంపేట, సెప్టెంబర్ 11 : గణనాథుడి ఆశీర్వాదంతో రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని ఎమ్మెల్యే మదన్‌రెడ్డి అన్నారు. గోమారంలో గౌడ సంఘం, శివ్వంపేటలో మహదేవ్ యూత్ ప్రతిష్ఠించిన గణనాథులకు ఎమ్మెల్యే ప్రత్యేక పూజలు చేశారు. ఆయన వెంట ఎం పీపీ హరికృష్ణ, జిల్లా గ్రంథాలయ చైర్మన్ చం ద్రాగౌడ్, జడ్పీటీసీ మహేశ్‌గుప్తా, పీఏసీఎస్ చైర్మన్ వెంకటరాంరెడ్డి, సర్పంచ్ లావణ్యామాధవరెడ్డి, ఆత్మకమిటీ చైర్మన్ వెంకట్‌రెడ్డి, టీఆర్ఎస్ మండలాధ్యక్షుడు రమణాగౌడ్, సర్పంచ్‌లు శ్రీనివాస్‌గౌడ్, చెన్నానాయక్, ఆత్మ కమిటీ డైరెక్టర్ కొండల్, ఉప సర్పంచ్ నవీన్ ఉన్నారు.
రామాయంపేట పట్టణంలో శోభాయాత్ర
రామాయంపేట, సెప్టెంబర్ 11 : పట్టణంలోని వైశ్యభవన్, చరిత రెసిడెన్సిలో మహిళలు సహస్ర దీపాలంకరణ చేశారు. మా టర్కండేయ ఆలయానికి చెందిన వినాయక లడ్డూను రూ. 11,116 పట్టణానికి చెందిన బల్ల పెంటయ్య కుమారులు యాదగిరి, భూమేశ్ కైవసం చేసుకున్నారు. కాగా, పట్టణంలో శోభాయాత్ర నిర్వహిస్తుండగా మెదక్ నుంచి వస్తున్న ఎమ్మెల్యే పద్మాదేవేందర్‌రెడ్డి కాసేపు ఆగి, మహిళలతో కలిసి ఆడారు.
పోటాపోటీగా లడ్డూల వేలంపాటలు
చిలిపిచెడ్, సెప్టెంబర్ 11 : మండల కేంద్రం చిలిపిచెడ్తో పాటు చండూర్, చిట్కుల్, శీలంపల్లి, సోమక్కపేట గ్రామా ల్లో పోటాపోటీగా వినాయక లడ్డూల వేలంపాటలు జరిగాయి. అనంతరం నిమజ్జన యాత్ర కన్నుల పండువగా సాగింది.
ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో పూజలు
చేగుంట, సెప్టెంబర్ 11 : చేగుంట, నార్సింగి మండలాల్లో వినాయక శోభాయాత్రలు నిర్వహించారు. చేగుంట పట్టణంలోని వాసవి కన్యకా పరమేశ్వరీ ఆలయంలో ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో హోమం, సామూహిక కుంకుమార్చన చేశారు. కార్యక్రమంలో ఆర్యవైశ్య సంఘం అధ్యక్షుడు నగేశ్, సర్పంచ్ శ్రీనివాస్, ఎంపీటీసీ వెంకటలక్ష్మి, పీఏసీఎస్ డైరెక్టర్ రఘురాములు, వైశ్యసంఘం నాయకులు, మహిళలు పాల్గొన్నారు.