మెదక్, సెప్టెంబర్ 10 (నమస్తే తెలంగాణ) : టీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు, ఇఫ్కో డైరెక్టర్ ఎం.దేవేందర్‌రెడ్డి పుట్టినరోజు వేడుకలను శనివారం మెదక్‌లోని ఎమ్మెల్యే క్యాంపు కా ర్యాలయంలో టీఆర్ఎస్ పట్టణాధ్యక్షుడు ఎం.గంగాధర్ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సందర్భంగా కేక్ కట్ చేసి దేవేందర్‌రెడ్డికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం మెదక్ పట్టణంలోని మాతా శిశు ఆరోగ్య కేంద్రంలో రోగులకు పండ్లు పంపిణీ చేశారు.
రోగుల సహాయకులు, దవాఖాన సిబ్బందికి అన్నదానం నిర్వహించారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ చంద్రపాల్, మార్కెట్ కమి టీ చైర్మన్ బట్టి జగపతి, కౌన్సిలర్లు జయరాజ్, సుంకయ్య, వసంత్‌రాజ్, ఆత్మ కమిటీ చైర్మన్ అంజాగౌడ్, వైస్ చైర్మన్ వెంకటనారాయణ, టీఆర్ఎస్ హవేళీఘనపూర్ మండల అధ్యక్షుడు శ్రీనివాస్‌రెడ్డి, టీఆర్ఎస్ మెదక్ పట్టణ ప్రధాన కార్యదర్శి గడ్డమీది కృష్ణాగౌడ్, నాయకులు రాగి అశోక్, లింగారెడ్డి, చింతల నర్సింహులు, ముత్యంగౌడ్, శ్రీధర్‌యాదవ్, మాయ మల్లేశం, సంగ శ్రీకాంత్, ప్రవీణ్‌గౌడ్, దుర్గాప్రసాద్, కృష్ణ, మధు, కొండ శ్రీనివాస్, శంకర్, శివరామకృష్ణ, నరేశ్, గఫ్పార్, ముజీబ్, ఉమర్, అమీర్ తదితరులు పాల్గొన్నారు.
రామాయంపేట, సెప్టెంబర్ 10 : పట్టణంలోని ఇఫ్కో డైరెక్టర్ మాధవరెడ్డిగారి దేవేందర్‌రెడ్డి పుట్టిన రోజు వేడుకలను టీఆర్ఎస్ పట్టణాధ్యక్షు డు, కౌన్సిలర్ గజవాడ నాగరాజు ఆధ్వర్యంలో నిర్వహిచారు. కార్యక్రమంలో రామాయంపేట పీఏసీఎస్ చైర్మన్ చంద్రం, కౌన్సిలర్లు దేమె యాదగిరి, చిలుక గంగాధర్, పీఏసీఎస్ డైరెక్టర్ పోచమ్మల ఐలయ్య, నాయకులు ఎస్కే హైమద్, సరాఫ్ శ్యాంసుందర్, మర్కు దత్తు, నాగేశ్వర్‌రెడ్డి, గోపరి నర్సింహులు, వివేక్‌రెడ్డి, అశోక్, మల్యాల కిషన్, రాజు ఉన్నారు.
నిజాంపేట/హవేళీఘనపూర్, సెప్టెంబర్ 10 : మండలకేంద్రంలోని ఎల్లమ్మ ఆలయంలో ఇఫ్కో డైరెక్టర్ పుట్టినరోజు వేడుకలు ఎంపీపీ దేశెట్టి సిద్ధిరాములు ఆధ్వర్యంలో నిర్వహించారు. కార్యక్రమంలో టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు సుధాకర్‌రెడ్డి, సర్పంచ్‌లు అనూష, అమరసేనారెడ్డి, గేమ్‌సింగ్, ఎంపీటీసీలు బాల్‌రెడ్డి, సురేశ్, రామాయంపేట ఏఎంసీ డైరెక్టర్ వెంకటేశం, పీఏసీఎస్ చైర్మన్, డైరెక్టర్లు బాపురెడ్డి, కిష్టారెడ్డి, స్వామిగౌడ్, అబ్దుల్ అజీజ్, మండల కో ఆప్షన్ సభ్యుడు గౌస్, రైతుబంధు సమితి మండల అధ్యక్షుడు సంపత్, గ్రామ అధ్యక్షుడు నాగరాజు, తిరుమల ఆలయ కమిటీ చైర్మన్ మహేశ్, నాయకులు రాములు, లక్ష్మీనర్సింహులు, లక్ష్మణ్, పర్శగౌడ్, అబ్దుల్‌పాషా, నగేశ్, ఎల్లం ఉన్నారు.
హవేళీఘనపూర్ మండలంలోని గాజిరెడ్డిపల్లిలో వేడుకల్లో సర్పంచ్ భాగ్యాశ్రీనివాస్, వార్డు సభ్యులు పాల్గొన్నారు.
పాపన్నపేట/చిన్నశంకరంపేట, సెప్టెంబర్ 10 : ఏడుపాయల వనదుర్గామాత ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. కార్యక్రమంలో టీఆర్ఎస్ మండలాధ్యక్షుడు విష్ణువర్ధన్, ఏడుపాయల దేవస్థానం చైర్మన్ బాలాగౌడ్, మార్కెట్ కమిటీ చైర్మన్ వెంకట్రామిరెడ్డి, సర్పంచ్‌లు కుమ్మరి జగన్, గురుమూర్తిగౌడ్, లింగారెడ్డి, సంజీవరెడ్డి, శ్రీనాథ్‌రావు, మాజీ సర్పంచ్ పాపారావు, నాయకులు అంథోని, బాబాగౌడ్, సాయిరెడ్డి, రఘు, ఆలయ ధర్మకర్తలు మనోహర్, కిషన్, ఉప్పరి వెంకటేశం, శ్రీనివాస్, దుర్గాదాస్ పాల్గొన్నారు.
చిన్నశంకరంపేటలో నిర్వహించిన వేడుకల్లో టీఆర్ఎస్ మండలాధ్యక్షుడు రాజు, రైతుబంధు మండల అధ్యక్షుడు లక్ష్మారెడ్డి, సర్పంచ్‌లు యాదగిరియాదవ్, జ్యోతి, పీఏసీఎస్ చైర్మన్ అంజిరెడ్డి, నాయకులు శ్రీనివాస్‌రెడ్డి, శ్రీనివాస్, బాగారెడ్డి, హేమచంద్రం, దేవానందం పాల్గొన్నారు.