సిద్దిపేట/సిద్దిపేట రూరల్/కోహెడ, సెప్టెంబర్ 10 : జిల్లాలో రెండు రోజులుగా ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం పడుతున్నది. శనివారం చినుకులతో మొదలై, మెల్లమెల్లగా భారీ వర్షంగా మారింది. ఈ వర్షంతో కొంత ఉపశమనం లభించింది. పత్తి, వరి పొలాల్లోకి వర్షం నీరు చేరింది. వర్షపు నీళ్లను రైతులు తొలిగిస్తున్నారు. నెల రోజులుగా వర్షం కోసం ఎదురు చూస్తున్న రైతులకు ఊరట కలిగింది. చెరువులు, కుంటలు పొంగి పొర్లుతున్నాయి. వీధులు జలమయమయ్యాయి.
జిల్లా వ్యాప్తంగా శనివారం 3 సెం.మీ వర్షపాతం నమోదైంది. మండలాల వారీగా చూస్తే, దుబ్బాకలో 2.1సెం.మీ, సిద్దిపేట రూరల్‌లో 2.38, చిన్నకోడూరులో 8.55, నంగునూరులో 2.66, సిద్దిపేట అర్బన్‌లో 9.95, తొగుటలో 3.70, మిరుదొడ్డిలో 3.05, దౌల్తాబాద్‌లో 6.44, కొమురవెల్లిలో 3.85, చేర్యాలలో 2.98, నారాయణరావుపేటలో 2.33, బెజ్జంకిలో 2.33, కోహెడలో 2.30, హుస్నాబాద్‌లో 2.30, అక్కన్నపేటలో 2.19, మద్దూరులో 2.68, రాయపోల్‌లో 1.84, వర్గల్లో 1.23, ములుగులో 1, మార్కుక్‌లో 1.48, జగదేవ్‌పూర్‌లో 2.14, గజ్వేల్‌లో 1.79, కొండపాకలో 2.62సెం.మీటర్ల వర్షం పడింది.
గజ్వేల్, సెప్టెంబర్ 10 : గజ్వేల్ నియోజకవర్గ వ్యాప్తంగా ఎడతెరిపి లేకుండా వర్షం కురిసింది. రెండు రోజులుగా మోస్తరు వర్షం కురుస్తుండగా, శనివారం ఉదయం నుంచి రాత్రి వరకు భారీస్థాయిలో పడింది. దీంతో వాహనాల రాకపోకలకు, సాధారణ ప్రజలకు ఇబ్బంది కలిగింది. గజ్వేల్ పట్టణంతో పాటు గ్రామాల్లోని ఖాళీ ప్రదేశాలన్నీ జలమయంగా మారాయి