సిద్దిపేట కమాన్, సెప్టెంబర్ 10 : అంగన్వాడీ కేంద్రాల ద్వారా ప్రభుత్వం గర్భిణులు, బాలింతలు, చిన్నారులకు అందజేసే పౌష్టికాహారాన్ని సద్వినియోగం చేసుకోవాలని మున్సిపల్ వైస్ చైర్మన్ కనకరాజు సూచించారు. శనివారం పట్టణంలోని 31, 32, 43వ వార్డుల్లో పౌష్టికాహారంపై గర్భిణులు, బాలింతలకు అవగాహన కల్పించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అంగన్వాడీ కేంద్రాల్లో ప్రతినెలా ఒకటో తేదీన బిడ్డ బరువు, ఎత్తు చెకింగ్ చేయించాలన్నారు. చిన్నారులు వయస్సుకు తగ్గ బరువు, ఎత్తు ఉండేలా చూసుకోవాలన్నారు. పిల్లలు, గర్భిణులు బలంగా ఉంటే జబ్బుల బారిన ఉండకుండా ఉంటారని తెలిపారు. కార్యక్రమంలో కౌన్సిలర్లు శ్రీలత, పూర్ణిమ, ఈసీవోఎస్ సూపర్వైజర్ సరిత, ఏఎన్ఎంలు, అంగన్వాడీ టీచర్లు, పాల్గొన్నారు.
నారాయణరావుపేట, సెప్టెంబర్ 10 : మండల పరిధిలోని మల్యాల అంగన్వాడీ కేంద్రంలో పోషణ మాసోత్సవాలు నిర్వహించారు. ఈ సందర్భంగా సర్పంచ్ వజ్రవ్వ మాట్లాడుతూ శిశువుకు తల్లిపాలు బాలామృతం వంటివన్నారు. కార్యక్రమంలో అంగన్వాడీ టీచర్లు, ఆశ వర్కర్లు తదితరులు పాల్గొన్నారు.
తొగుట, సెప్టెంబర్ 10 : మహిళలు పౌష్టికాహారం తీసుకోవాలని ఏఎన్ఎం కృష్ణవేణి, ఉపసర్పంచ్ రమేశ్ సూచించారు. మండలంలోని బండార్పల్లి గ్రామ అంగన్వాడీ కేంద్రంలో పోషణ మా సోత్సవాలు నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తల్లులు పౌష్టికాహారం తీసుకోకపోతే పుట్టబోయే పిల్లల ఆరోగ్యంపై ప్రభా వం చూపుతుందన్నారు. కార్యక్రమంలో అంగన్వాడీ టీచర్లు పాల్గొన్నారు.