చేర్యాల, సెప్టెంబర్ 10 : చాకలి ఐలమ్మ నేటి తరానికి స్ఫూర్తిదాయకమని ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి అన్నారు. టీఆర్ఎస్ ఆధ్వర్యంలో చేర్యాలలో శనివారం చాకలి ఐలమ్మ వర్ధంతి నిర్వహించారు.ఈ సందర్భంగా ఆమె చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం జరిగిన కార్యక్రమంలో ఎమ్మెల్యే మాట్లాడుతూ ఐలమ్మ ఉద్యమస్ఫూర్తిని రగిలించిందన్నారు.
కార్యక్రమంలో రైతు బంధు సమితి జిల్లా సభ్యుడు అంకుగారి శ్రీధర్‌రెడ్డి, తాడెం కృష్ణమూర్తి, టీఆర్ఎస్వై నాలుగు మండలాల అధ్యక్షుడు శివగారి అంజయ్య, యూత్ మండల అధ్యక్షుడు ఆకుల రాజేశ్‌గౌడ్, టీఆర్ఎస్వీ మండల అధ్యక్షుడు పెంబర్ల రాజశేఖర్, మండల ఉపాధ్యక్షుడు బండోజు భాస్కర్, టౌన్ సంయుక్త కార్యదర్శి బూరగోని తిరుపతిగౌడ్, శనిగరం లక్ష్మణ్, కోతి దాసు,టౌన్ యూత్ అధ్యక్షుడు యాట భిక్షపతి పాల్గొన్నారు.
పట్టణ, మండల రజక సంఘం, సీపీఎం, సీపీఐ ఆధ్వర్యంలో ఐలమ్మ వర్ధంతి నిర్వహించారు.ఈ సందర్భంగా ఐలమ్మ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో రజక సంఘం టౌన్ అధ్యక్షుడు భిక్షపతి, మండల అధ్యక్షుడు శివగారి అంజయ్య, సీపీఎం, సీపీఐ మండల కార్యదర్శులు కొంగరి వెంకట్‌మావో, అందె అశోక్ పాల్గొన్నారు.