పెద్దశంకరంపేట, సెప్టెంబర్10: మండలంలోని ప్రతి పల్లెలో అర్హులందరికీ ఆసరా పింఛన్లు ప్రభుత్వం అందజేస్తుందని, దీంతో గ్రామాల్లో పండుగ వాతావరణం నెలకొన్నదని నారాయణఖేడ్ ఎమ్మెల్యే భూపాల్‌రెడ్డి అన్నారు. శనివారం మండల పరిధిలోని శివయపల్లి, మాడ్చెట్‌పల్లి గ్రామాల్లో ప్రభుత్వం కొత్తగా మంజూరు చేసిన పింఛన్ల ప్రొసీడింగ్‌లను స్థానిక ప్రజాప్రతినిధులతో కలిసి పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ నిరుపేద కుటుంబాల వారికి తెలంగాణ ప్రభుత్వం అందిస్తున్న ఆసరా పింఛన్ల పథకం పేదలకు వరమన్నారు.
మండల పరిధిలోని కొత్తపేట సర్పంచ్ అనంతరావు సతీమణి ఇటీవల చనిపోవడంతో ఎమ్మెల్యే వారి కుటుంబాన్ని పరామర్శించారు. ఆయనవెంట ఎంపీపీ జంగం శ్రీనివాస్, టీఆర్ఎస్ మండలాధ్యక్షుడు మురళీపంతులు, వైస్ ఎంపీపీ లక్ష్మీరమేశ్, రైతుబంధు అధ్యక్షుడు సురేశ్‌గౌడ్, సర్పంచ్‌లు నరేశ్, రమ్య అశోక్, ఎంపీటీసీ వీణా సుభాశ్‌గౌడ్, తదితరులున్నారు.