మెదక్‌రూరల్, సెస్టెంబర్ 9 : సీఎం కేసీఆర్‌తోనే గ్రామాల్లో అభివృద్ధి జరుగుతుందని, ఇంటింటికీ సంక్షేమ పథకాలు చేరు తున్నాయని మెదక్ ఎమ్మెల్యే పద్మాదేవేందర్‌రెడ్డి అన్నారు. శుక్రవారం మెదక్ మండలం రాజ్‌పల్లి గ్రామంలో వివిధ అభివృద్ధి పనులను శుక్రవారం స్థానిక సర్పంచ్ ప్రేమలతతో కలిసి ప్రారంభించారు. రూ. 5లక్షలతో ముదిరాజ్ కమ్యూనిటీ భవ నానికి ప్రహరీ నిర్మాణానికి భుమిపూజ చేశారు. అనంతరం రేషన్ దుకాణాన్ని ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే పద్మాదేవేందర్‌రెడ్డి మాట్లాడుతూ.. టీఆర్ఎస్ ప్రభుత్వం పేద ప్రజల సంక్షేమానికి అనేక పథకాలను అమలు చేస్తున్నద న్నా రు. రేషన్ డీలర్లు ప్రజలకు అందుబాటులో ఉంటూ రేషన్ సరు కులను అందించాలని సూచించారు. తర్వలో కొత్త రేషన్ కార్డులు అందజేస్తామన్నారు. రైతు సంక్షేమానికి సీఎం కేసీఆర్ దేశంలో ఎక్కడా లేని పథకాలను తెలంగాణలో అమలు చేస్తున్నారని వివరించారు. గోదావరి జలాతో భూగర్భ జలాలు పుష్కలంగా పెరిగాయన్నారు.
అర్హులందరికీ ఆసరా పింఛన్లు ఇస్తామని ఎమ్మెల్యే పేర్కొన్నారు. కార్యక్రమంలో మున్సిపాల్ చైర్మన్ చం ద్రపాల్, వైస్ ఎంపీపీ ఆంజనేయులు, టీఆర్ఎస్ ప్రధాన కార్యదర్శి ఎలక్షన్‌రెడ్డి, ముదిరాజ్ సంఘం గ్రామాధ్యక్షుడు లక్ష్మీనారయణ, ఉప సర్పంచ్ నవీన్ పాల్గొన్నారు.
మెదక్ పట్టణంలో నేతాజీ గణేశ్ మండలి ప్రతిష్ఠించిన గణనాథుడికి ఎమ్మెల్యే పద్మాదేవేందర్‌రెడ్డి పూజలు నిర్వహించారు. వినాయక శోభాయాత్రతోపాటు నిమజ్జన వేడుకల్లో నిర్వాహ కులు ప్రజలకు ఇబ్బందులు తలెత్తకుండా జాగ్రత్తలు తీసుకో వాలని సూచించారు. ఎమ్మెల్యే వెంట నాయకులు ఉన్నారు.