రేగోడ్, సెప్టెంబర్ 8 : అన్ని వర్గాల ప్రజల సంక్షేమమే టీఆర్ఎస్ ప్రభుత్వ ధ్యేయమని అందోల్ ఎమ్మెల్యే చంటి క్రాంతికిరణ్ అన్నారు. మండలంలోని గజ్వాడ, లింగంపల్లి, మర్పల్లి, రేగోడ్, కొత్వాల్పల్లి, కొండాపూర్, ఇటిక్యాల (ఆర్) గ్రామాల్లో గురువారం లబ్ధిదారులకు ఆసరా పింఛన్ మంజూ రు పత్రాలను పంపిణీ చేశారు. పలువురు బాధిత కుటుంబాల కు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను ఎమ్మెల్యే అందజేశారు. మొ దటగా గజ్వాడ గ్రామంలో 81 ఆసరా పింఛన్లను అందజే శారు. ఈ సందర్భగా సర్పంచ్ అనితామాణెప్ప డప్పుచప్పుళ్లతో ఎమ్మెల్యేకు స్వాగతం పలికారు. అనంతరం మిగతా గ్రామాల్లో ఎమ్మెల్యే పర్యటించి, పింఛన్లు, సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను లబ్ధిదారులకు అందజేశారు. ఆయా కార్యక్రమాల్లో ఎమ్యెల్యే చంటిక్రాంతికిరణ్ మాట్లాడుతూ.. తెలంగాణలో అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు దేశంలో ఎక్కడా లేవన్నా రు.
ప్రజల కనీస అవసరాలను దృష్టిలో పెట్టుకొని సంక్షేమ కార్యక్రమాలను సీఎం కేసీఆర్ అమలు చేస్తున్నట్లు వివరించా రు. పార్టీలు, రాజకీయాలకు అతీతంగా దళారులు లేకుండా లబ్ధ్దిదారులకు నేరుగా బ్యాంకు ఖాతాల్లో నగదును ప్రభుత్వం జమ చేస్తుందన్నారు. జవాబుదారీగా పని చేస్తున్నది కేవలం టీఆర్ఎస్ ప్రభుత్వమన్నారు. గతంతో జరిగిన అభివృద్ధిని ఇ ప్పుడు జరుగుతున్న అభివృద్ధిని పరిశీలించి, టీఆర్ఎస్కు అం డగా ఉండాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో టీఆర్ఎస్ మండలాధ్యక్షుడు బుచ్చయ్య, ప్రధానకార్యదర్శి రమేశ్, రైతు బంధు సమితి మండలాధ్యక్షుడు రాజేందర్ పాటిల్, ఎంపీటీ సీలు నర్సింహులు, సంగీత, సర్పంచులు సుమంతావినోద్, మంజులానాగయ్య, పూలమ్మ, సిద్ధారెడ్డి, విజయలక్ష్మి, రవీందర్, నర్సింహులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.
రెడ్డిపల్లిలో పింఛన్ కార్డుల పంపిణీ
మండలంలోని రెడ్డిపల్లిలో లబ్ధిదారులకు ఆసరా పింఛన్ మంజూరు కార్డులను టీఆర్ఎస్ నాయకులు అందజేశారు. కార్యక్రమంలో టీఆర్ఎస్ నాయకులు రవీందర్రెడ్డి, సాయికుమార్, భాగయ్య పాల్గొన్నారు.
నేడు అల్లాదుర్గంలో అందోల్ ఎమ్మెల్యే పర్యటన
అల్లాదుర్గం మండలంలో అందోల్ ఎమ్మెల్యే క్రాంతికిరణ్ శుక్రవారం పర్యటిస్తున్నట్లు టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు పల్లెగడ్డ నర్సింహులు గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. అల్లాదుర్గంలోని పటేల్చెరువులో చేపపిల్లలను వదలనున్న ట్లు, అనంతరం గ్రామాల్లో పింఛన్లను పంపిణీ చేస్తారన్నారు.