రామాయంపేట, సెప్టెంబర్ 8 : విలువలతో కూడిన విద్యను విద్యార్థులకు నేర్పినప్పుడే గురువులుగా సమాజంలో పేరుప్రతిష్టలు దక్కుతాయని జిల్లా విద్యాధికారి రమేశ్‌కుమార్ అన్నారు. గురువారం రామాయంపేటలోని ఓ ఫంక్షన్హాల్లో నిజాంపేట, రామాయంపేట మండలాలకు సంబంధించిన గురు పూజోత్సవాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా 32 మందిని ఉత్తమ ఉపాధ్యాయులుగా ఎంపిక చేసి సత్కరించారు. ఈ సంద ర్భంగా డీఈవో మాట్లాడారు. మనిషికి విద్య ఆయుధ మని, ఈ ఆయుధం ఉపాధ్యాయుడి దగ్గరే ఉంటుందన్నారు. ప్రతి విషయంలో విద్యార్థ్ధికి గురువు మార్గదర్శ కంగా ఉండాల ని సూచించారు. ఈ రోజుల్లో విద్యార్థు లు సెల్ఫోన్లో ఆడుతున్నారని, నిజమైన ఆటలను మ ర్చిపోయారని ఆవేదన వ్యక్తం చేశారు. రోజులో కనీసం ఒక గంటనైనా ఆటలు ఆడాలని సూచించారు. ప్రభుత్వ బడుల్లోనే నాణ్యమైన విద్య లభిస్తుందన్నారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ జితేందర్‌గౌడ్, ఏఎంసీ చైర్మన్ యాదగిరి, నిజాంపేట ఎంపీపీ సిద్ధ్దిరాములు, మాజీ ఎంపీటీసీ సిద్ధిరాంరెడ్డి, కమిషనర్ ఉమాదేవి, ఎంఈవో నీలకంఠం, ఉపాధ్యాయ సంఘాల భాద్యులు రాగి రాములు, సబ్బని శ్రీనివాస్, సాంగని యాదగిరి, వెంకట్రాంరెడ్డి, కమ్మరి రవీందర్, ఇంద్రసేనాచారి, సురేశ్, రమేశ్‌బాబు శర్మ, రవీందర్‌గౌడ్ పాల్గొన్నారు.
విద్యాభివృద్ధికి ప్రభుత్వం పెద్దపీట: మహిళా కమిషన్ చైర్పర్సన్ సునీతాలక్ష్మారెడ్డి
ప్రభుత్వం విద్యాభివృద్ధికి పెద్దపీట వేస్తున్నదని మహిళా కమిషన్ చైర్పర్సన్ సునీ తాలక్ష్మారెడ్డి అన్నారు. మండలంలోని ఉత్తమ ఉపాధ్యా యులను ఎంపీపీ హరికృష్ణ, ఎంఈవో బుచ్యానాయక్ తో కలిసి సన్మానించారు. కార్యక్రమంలో తహసీల్దార్ శ్రీనివాస్‌చారి, ఎంపీడీవో నవీన్‌కుమార్, జడ్పీ కోఆప్షన్ సభ్యుడు మన్సూర్, పీఏసీఎస్ చైర్మన్ వెంకటరాంరెడ్డి, ఆత్మకమిటీ చైర్మ వెంకట్‌రెడ్డి, టీఆర్ఎస్ మండలాధ్యక్షు డు రమణాగౌడ్, కోశాధికారి గంగాధర్, సర్పంచ్‌లు బా బూరావు, చంద్రకళాశ్రీశైలం, ఎంపీటీసీ సత్తిరెడ్డి, ఆత్మ కమిటీ డైరెక్టర్ సూర్యంచౌహాన్ పాల్గొన్నారు.