హుస్నాబాద్, సెప్టెంబర్ 5: దళితుల కుటుంబాల్లో వెలుగులు నింపేందుకే ప్రభుత్వం దళిత బంధు పథకాన్ని అమలు చేస్తున్నదని ఎమ్మెల్యే వొడితెల సతీశ్‌కుమార్ అన్నారు. సోమవారం హుస్నాబాద్‌లోని సిద్దిపేట రోడ్డులో దళితబంధు పథకంతో సిరిసిల్ల మైసమ్మ అనే లబ్ధిదారురాలు ఏర్పాటు చేసుకున్న అక్షయగ్రాండ్ ఫ్యామిలీ రెస్టారెంట్‌ను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఎంతో మంది యువతీ యువకులు దళితబంధు ద్వారా లబ్ధిపొంది ఉపాధి అవకా శాలను మెరుగుపర్చుకుంటున్నారని అన్నారు. అంతకు ముందు నాగారం రోడ్డులోని ఆదిత్య డయాగ్నొస్టిక్ సెంటర్, హనుమకొండ రోడ్డులోని ఎల్ఎం సర్జికల్ కాటన్ తయారీ కేంద్రాన్ని ఆయన ప్రారంభించారు. మరోవైపు హుస్నాబాద్ క్యాంపు కా ర్యాలయంలో ఎమ్మెల్యే 14 మందికి సీఎం సహాయ నిధి చెక్కులు పంపిణీ చేశారు. మున్సిపల్ చైర్పర్సన్ రజిత, వైస్‌చైర్‌పర్సన్ అనితారెడ్డి, ఎంపీపీలు లకావత్ మానస, లక్ష్మి, జడ్పీటీసీ మం గ, ఎన్ఎల్సీఎఫ్ డైరెక్టర్ రాజ్యలక్ష్మి పాల్గొన్నారు.
హుస్నాబాద్‌లోని వైశ్యభవన్‌లో ఆర్యవైశ్య సం ఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన గణేశ మండ పం వద్ద స్వామివారికి ఎమ్మెల్యే వొడితెల సతీశ్‌కుమార్ ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా పూజారి రామక పవన్‌శర్మ ఆధ్వర్యంలో పూజలు నిర్వహించారు. అనంతరం అక్కడే ఏర్పాటు చేసిన అన్నదాన కార్యక్రమాన్ని ఎమ్మెల్యే ప్రారంభించారు. ఆర్యవైశ్య సంఘం నాయకులు, ప్రజాప్రతినిధులు, నాయకులు పాల్గొన్నారు.