వెల్దుర్తి, సెప్టెంబర్ 5: ఉపాధ్యాయ వృత్తి ఎంతో ఉన్నత మైనదని ఎమ్మెల్యే మదన్‌రెడ్డి, మహిళా కమిషన్ చైర్పర్సన్ సునీతాలక్ష్మారెడ్డి అన్నారు. ఉపాధ్యాయ దినోత్సవాన్ని పురస్కరించుకుని సోమవారం మండలంలో ఉత్తమ ఉపాధ్యాయులుగా ఎంపికైనా ఉపాధ్యాయులను పూలమాల, శాలువాలతో సత్కరించారు. అనంతరం వారు మాట్లాడుతూ ప్రతి ఒక్కరి భవిష్యత్‌ను తీర్చిదిద్ధే ప్రదాతలు ఉపాధ్యాయులని, తల్లి, తండ్రి తరువాత స్థానం ఉపాధ్యాయులకే ఇచ్చారని కొనియాడారు. ప్రభుత్వ పాఠశాలలను సర్కార్ ప్రైవేటుకు దీటుగా తీర్చిదిద్దుతున్నదన్నారు. మనఊరు-మన బడి కార్యక్రమం ద్వారా ప్రభుత్వ పాఠశాలల రూపురేఖలు మారనున్నాయన్నారు.
మండలంలోని శెట్పల్లికలాన్లో ప్రత్యేక నిధులతో నిర్మించే సీసీ రోడ్డు పనులను ఎమ్మెల్యే మదన్‌రెడ్డి, మహి ళా కమిషన్ చైర్మన్ సునీతాలక్ష్మారెడ్డి సోమవారం ప్రారంభించారు. గ్రామపంచాయతీల అభివృద్ధికి ప్రత్యేక నిధులను నేరుగా పంచాయతీల ఖాతాల లో జమ చేయడమే కాకుండా పల్లెప్రగతి, పట్టణప్రగతి కార్యక్రమాల ద్వారా పల్లెలు, పట్టణాలు అందంగా అయ్యాయన్నారు. కార్యక్రమంలో ఎంపీపీ స్వరూపానరేందర్రెడ్డి, జడ్పీటీసీ రమేశ్ గౌ డ్, సర్పంచ్ లతశ్రీనివాస్గౌడ్, ఆత్మకమిటీ చైర్మన్ ప్రతాప్‌రెడ్డి, ఎంఈవో యాదగిరి, నాయకులు నరేందర్‌రెడ్డి, వెంకట్‌రెడ్డి, నాయకులు పాల్గొన్నారు.