శివ్వంపేట, సెప్టెంబర్ 5 : శివ్వంపేట అభివృద్ధికి మరింత కృషి చేస్తానని నర్సాపూర్ ఎమ్మెల్యే మదన్‌రెడ్డి, రాష్ట్ర మహిళా కమిషన్ చైర్పర్సన్ సునీతాలక్ష్మారెడ్డి అన్నారు. సోమవారం శివ్వంపేటలో షాపింగ్‌కాంప్లెక్స్‌ను సర్పంచ్ పత్రాల శ్రీనివాస్‌గౌడ్, జడ్పీటీసీ పబ్బమహేశ్గుప్తాతో కలిసి ప్రారంభించా రు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పంచాయతీ అభివృద్ధికి జడ్పీటీసీ పబ్బమహేశ్గుప్తా, సర్పంచ్ పత్రాల శ్రీనివాస్‌గౌడ్‌లు ముందుకు వచ్చి అభివృద్ధికి ఆదాయ వనరులను సమకూర్చేందుకు చేసిన కృషి అభినందనీయం అన్నారు. శివ్వంపేటలో ప్రధానరహదారిపై బటర్‌ఫ్లై లైట్లకు నిధులు మంజూరు చేస్తానని, అర్హులందరికీ డబుల్బెడ్రూం ఇండ్లు అందజేస్తామన్నారు.
గ్రామంలో సీసీ రోడ్ల నిర్మాణానికి స్పెష ల్ డెవలప్మెంట్ నిధులు మంజూరు చేస్తానన్నారు. శివ్వంపేట ఆదర్శ గ్రామంగా నిలువాలని అన్నారు. అనంతరం సర్పంచ్‌ను, పాలకవర్గాన్ని వారు సన్మానించారు. కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ చైర్మన్ చంద్రాగౌడ్, జడ్పీటీసీ మహేశ్‌గుప్తా, జడ్పీ కో-ఆప్షన్ మన్సూర్, ఆత్మకమిటీ చైర్మన్ గొర్రె వెంకట్‌రెడ్డి, పీఏసీఎస్ చైర్మన్ వెంకటరాంరెడ్డి, తహసీల్దార్ శ్రీనివాస్ చారి, సర్పంచ్ల ఫోరం అధ్యక్షుడు లా వణ్యమాధవరెడ్డి, కౌన్సిలర్ అశోక్‌గౌడ్, టీఆర్ఎస్ మండలాధ్యక్షుడు రమణాగౌడ్, కో-ఆప్షన్ మెంబర్ లాయక్, ఉప సర్పంచ్ పద్మావెంకటేశ్, ఆత్మడైరెక్టర్లు కొండల్, సూర్యచౌహాన్, భిక్షపతి, సర్పంచ్‌లు, ఎంపీటీసీలు పాల్గొన్నారు.
శివ్వంపేటలో ఎమ్మెల్యే మదన్‌రెడ్డి, మహిళా కమిషన్ చైర్పర్సన్ సునీతాలక్ష్మారెడ్డి, జడ్పీటీసీ మహేశ్‌గుప్తా, ఎంపీపీ కల్లూరి హరికృష్ణల సహకారంతో ఇప్పటికే ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు జరిగాయి. రైతుబజార్‌తో పాటు మోడల్ బస్టాండ్‌ను నిర్మించాము. వందశాతం సీసీరోడ్లు, పచ్చదనం పరిశుభ్రత దిశగా అడుగులు వేస్తున్నామని, అందుకు ప్రతీ ఒక్కరిని కలుపుకొని అభివృద్ధి చేస్తాము.
– పత్రాల శ్రీనివాస్‌గౌడ్, సర్పంచ్
శివ్వంపేట, సెప్టెంబర్ 5: జర్నలిస్టుల సమస్యలు పరిష్కరిస్తామని ఎమ్మెల్యే మదన్‌రెడ్డి, రాష్ట్ర మహిళా కమిషన్ చైర్పర్సన్ సునీతాలక్ష్మారెడ్డి అన్నారు. శివ్వంపేటలో ప్రెస్‌క్లబ్ భవన నిర్మాణానికి భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నిత్యం ప్రజల సమస్యలను ప్రభుత్వాని కి తెలియజేస్తూ, సంక్షేమ కార్యక్రమాలు ప్రజలకు చేరవేయడంలో జర్నలిస్టుల పాత్ర కీలకం అని గుర్తు చేశారు. సీఎం కేసీఆర్ జర్నలిస్టుల సంక్షేమానికి పెద్దపీట వేస్తున్నారన్నారు. అనంతరం ప్రెస్‌క్లబ్ అధ్యక్షుడు రవి మాట్లాడుతూ ప్రెస్‌క్లబ్‌కు స్థలం కేటాయించడంపై ఎంపీపీ కల్లూరి హరికృష్ణ, జడ్పీటీసీ మహేశ్‌గుప్తా, సర్పంచ్ పత్రాల శ్రీనివాస్‌గౌడ్‌కు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.