జహీరాబాద్, సెప్టెంబర్ 4: నేరాలు నివారించేందుకు ప్రభుత్వం కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటున్నది. దీంట్లో భాగంగానే జహీరాబాద్ నుంచి ముంబయి వెళ్లే జాతీయ రహదారిపై అత్యాధునిక సీసీ కెమెరాలను ఏర్పాటు చేసి స్థానిక పోలీస్ స్టేషన్‌తో పాటు హైదరాబాద్‌లోని కమాండ్ అండ్ కంట్రోల్ రూంకి అనుసంధానం చేశారు. వీటి ద్వారా నేరాలకు పాల్పడి రాష్ర్టాలు దాటుతున్న వారిని వెంటనే పట్టు కునే అవకాశం ఉంది. కర్ణాటక, మహారాష్ర్ట సరిహద్దుల్లో ఉన్న జహీరాబాద్ ప్రాంతంలో చిన్న సంఘటన జరిగినా వెంటనే కమాండ్ కంట్రోల్ రూం కు సమాచారం వెళ్లే అవకాశం ఉంది. జహీరాబాద్ పట్టణ పోలీసు స్టేషన్లో నూతన సాంకేతికతో వీడియో, ఆడియో, సీసీ కెమెరాలను ఏర్పాటు చేశారు. ప్రజలు పోలీసు స్టేషన్లోకి వచ్చి వెళ్లే మార్గాలు, అధికారి గది, నిందితులను ఉంచే గది, రైటర్స్ గది, ఫిర్యాదులు స్వీకరణ ప్రాంతం, స్వాధీనం చేసుకున్న వాహనాల నిలుపుదల ప్రాంతంలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు.
ప్రయోగాత్మకంగా 17 సీసీ కెమెరాలు అనుసంధానం
పట్టణంలోని ప్రధాన చౌరస్తాల వద్ద ఏర్పాటు చేసిన 17 సీసీ కెమెరాలను హైదరాబాద్‌లోని కమాండ్ అండ్ కంట్రో ల్ కేంద్రానికి అనుసంధానం చేశారు. జహీరాబాద్ సబ్ డివిజన్లోని జహీరాబాద్ పట్టణ, రూరల్, చిరాగ్పల్లి, కోహీర్, హద్నూ ర్, ఝరాసంగం, రాయికోడ్ పోలీసు స్టేష న్ పరిధిలో ఉన్న ప్రధాన చౌరస్తాలు, గ్రామాల్లో ఉన్న సీసీ కెమెరాలను సైతం అనుసంధానం చేశారు.

65వ జాతీయ రహదారి, బీదర్ రోడ్డుపై నిఘా
ప్రజల భద్రత కోసం పోలీసు అధికారులు దాతల సహకా రం, కమ్యూనిటీ డెవలప్మెంట్ సొసైటీలు, స్వచ్ఛంద సంస్థ లు, వాణిజ్య వ్యాపార నిర్వాహకుల సహకారంతో సీసీ కెమెరాలు ముంబయి-హైదరాబాద్ 65వ జాతీయ రహదారిపై ఏర్పాటు చేశారు. వాటిని పోలీసు శాఖ పర్యవేక్షి స్తుంది. ప్రధా న చౌరస్తాల వద్ద ఇరువైపులా కెమెరాలు ఏర్పా టు చేశారు. ముఖ్యమైన ప్రాంతాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి కంట్రో ల్ రూం పరిధిలో పర్యవేక్షిస్తున్నారు.
రహదారిపై నిఘా కోసం సీసీ కెమెరాలు ఏర్పాటు
65వ నంబర్ జాతీయ ర హదారి, కర్ణాటక, మహారా ష్ట్రాలకు జహీరాబాద్ సరిహద్దులో ఉండటంతో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి పర్యవేక్షి స్తున్నాం. ప్రధాన రోడ్లు, చౌరస్తాలు, బ్యాంకులు, ఏటీఎంలు, ప్రభుత్వ కార్యాలయాలకు వెళ్లే దారిలో కెమెరాలను బిగించాం. పోలీసు స్టేషన్లో వాటి దృశ్యాలను పరిశీలిస్తున్నాం. రహదారిపై రోడ్డు ప్రమాదా లు జరిగిన వెంటనే పుటేజీలు పరిశీలించేందుకు ఏర్పాట్లు చేశాం. దీంతో జాతీయ రహదారి నిఘా నేత్రాల మద్య ఉంది. సబ్ డివిజన్లో ఉన్న గంగ్వార్ చౌరస్తా, ముంగ్గి చౌరస్తా, రాయికోడ్ చౌరస్తా, కప్పాడు, ఝరాసంగం, పస్తాపూర్ చౌరస్తా, కోహీర్ చౌరస్తాతో పాటు పలు ప్రాంతాల్లో కెమెరాలు ఏర్పాటు చేసి పర్యవేక్షిస్తున్నాం.
– రఘు, డీఎస్పీ జహీరాబాద్