ప్రజా సంక్షేమమే టీఆర్ఎస్ ప్రభుత్వ ధ్యేయమని పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్‌రెడ్డి అన్నారు. శనివారం పటాన్చెరు డివిజన్ 113లో జీహెచ్ఎంసీ మల్టీపర్పస్ ఫంక్షన్ హాల్లో 932 మందికి పింఛన్ల ప్రొసీడింగ్స్, కార్డులను కార్పొరేటర్ మెట్టు కుమార్ యాదవ్‌తో కలిసి ఎమ్మెల్యే అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ సీఎం కేసీఆర్ అన్ని వర్గాల ప్రజల అభివృద్ధికి కృషి చేస్తున్నారన్నారు. ప్రతి గ్రామంలో, పట్టణంలో వృద్ధులు, దివ్యాంగులు, వితంతులు, ఒంటరి మహిళలకు ప్రతి నెలా పింఛన్లు అందజేసి, వారి సంక్షేమంలో పాల్పంచుకుంటున్నారన్నారు. సీఎం సాయంతో నేడు వృద్ధులు, ఒంటరి మహిళలు ఆర్థిక భరోసాతో జీవితాలు గడుపుతున్నారన్నారు. నియోజకవర్గంలో ప్రతి నెలా రూ.3 కోట్లకుపైగా నిధులను పింఛన్ల ద్వారా 15 వేల మందికి పింఛన్లు అందజేస్తున్నామన్నారు. దేశంలో ఏ రాష్ట్రంలో ఈ స్థాయి పింఛన్లు ఇవ్వడం లేదని గుర్తుచేశారు.
రామచంద్రాపురంలో..
ఆసరా పింఛన్లు పేదలకు భరోసా కల్పిస్తున్నాయని ఎమ్మెల్యే అన్నా రు. ఆర్సీపురం, భారతీనగర్ డివిజన్లకు చెందిన 1142 మంది లబ్ధిదారులకు ఆసరా పింఛన్లను కార్పొరేటర్లు పుష్పానగేశ్, సింధూ ఆదర్శ్‌రెడ్డితో కలిసి ఎమ్మెల్యే అందజేశారు. పేదల సంక్షేమమే లక్ష్యంగా టీఆర్ఎస్ ప్రభుత్వం చిత్తశుద్ధితో పని చేస్తున్నదన్నారు. పింఛన్ల కోసం దరఖాస్తు చేసుకున్నప్పటికీ మొదటి లిస్ట్‌లో రాని వాళ్లు అధైర్య పడవద్దని, అర్హులైన వారందరికీ ఇప్పిస్తామని అన్నారు. కార్యక్రమంలో పటాన్చెరు మార్కెట్ కమిటీ చైర్మన్ విజయ్‌కుమార్, జీహెచ్ఎంసీ ఉప కమిషనర్ బాలయ్య, టీఆర్ఎస్ పట్టణ అధ్యక్షుడు అఫ్జల్, మార్కెట్ కమిటీ డైరెక్టర్లు అశోక్, ప్రమోద్‌గౌడ్, నాయకుడు వెంకటేశ్ సర్కిల్ అధ్యక్షుడు పరమేశ్, సర్కిల్ యూత్ అధ్యక్షుడు నర్సింహ, డివిజన్ల అధ్యక్షులు గోవింద్, బూన్, ఏంఎంసీ డైరెక్టర్లు ప్రమోద్‌గౌడ్, సత్యనారాయణ, మాజీ కార్పొరేటర్ అంజయ్య, నాయకులు దేవేంద్రచారి, ఖదీర్, బేకు యాదయ్య, కృష్ణ, నర్సింగ్‌రా వు, కుత్బుద్దీన్, నారాయణరెడ్డి, రవి పాల్గొన్నారు.