నర్సాపూర్, సెప్టెంబర్1 : సీఎం కేసీఆర్‌ను ముట్టుకుంటే తేనెపట్టును ముట్టుకున్నట్లే ఉంటుందని ప్రతిపక్షాలకు ఎమ్మె ల్యే చిలుముల మదన్‌రెడ్డి హెచ్చరించారు. గురువారం నర్సాపూర్ సమీపంలోని సాయికృష్ణ గార్డెన్లో ప్రభుత్వం మంజూరు చేసిన 664 ఆసరా పింఛన్లు, 23 కల్యాణలక్ష్మి, షాదీముబారక్ చెక్కులను ఎమ్మెల్యే, రాష్ట్ర మహిళా కమిషన్ చైర్పర్సన్ సునీతాలక్ష్మారెడ్డి లబ్ధిదారులకు అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ఎమ్మెల్యేలను భ యపెట్టి కొనాలనే ధోరణిలో బీజేపీ ఉందని, ఇక్కడ ఎవరూ భయపడరని తెలిపారు. కేంద్రం మోటర్లకు మీటర్లు పెడితే డబ్బులిస్తామని ఆఫర్ ప్రకటించినా సీఎం కేసీఆర్ రైతాంగాన్ని దృష్టిలో పెట్టుకుని వారికి తలొగ్గలేదని స్పష్టం చేశారు. ప్రస్తుతం యావత్ దేశం తెలంగాణ వైపు చూస్తున్నదన్నారు. పింఛన్లతో కుటుంబంలో సంబంధాలు బలపడ్డాయన్నారు. 57 ఏండ్లు నిండిన లబ్ధిదారులకు ఆసరా పింఛన్ అందజేస్తామని సీఎం కేసీఆర్ ఇచ్చిన హామీని నిలబెట్టుకున్నారన్నా రు. రాష్ట్రవ్యాప్తంగా పార్టీలకు అతీతంగా ఆసరా పింఛన్లను మంజూరు చేస్తున్నది తెలిపారు. ఇప్పటికి మం డలవ్యాప్తం గా 57 వయస్సు నిండిన 95 శాతం మందికి పింఛన్లు మంజూ రు చేసినట్లు తెలిపారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో 70 నుంచి 80 వరకు ఎమ్మెల్యే స్థానాలు గెలుపొంది మళ్లీ, అధికారం చేపడతామని ఆశాభావం వ్యక్తం చేశారు. త్వరలోనే విలేకరులకు డబుల్ బెడ్రూమ్ ఇండ్లు పంపిణీ చేస్తామని హామీ ఇచ్చారు.
దేశానికే తెలంగాణ ఆదర్శం
సీఎం కేసీఆర్ తీసుకొస్తున్న పథకాలతో తెలంగాణ దేశానికే ఆదర్శంగా నిలిచిందని రాష్ట్ర మహిళా కమిషన్ చైర్పర్సన్ సునీతాలక్ష్మారెడ్డి వెల్లడించారు. స్వతంత్ర భారత వజ్రోత్సవాల్లో భాగంగా 57 ఏండ్లు నిండిన వారికి సీఎం కేసీఆర్ ఆసరా పింఛన్లు అందించడం గొప్ప విషయమన్నా రు. రైతుబంధు, రైతుబీమాతో రైతాంగానికి వెన్నుదన్నుగా నిలిచారన్నారు. పింఛన్ రాని వాళ్లు ఆందోళన చెందవద్దని, అందరికీ అందుతాయని తెలిపారు. అనంతరం మండలంలోని పలు గ్రామాలకు చెందిన సర్పంచ్‌లు ఎమ్మెల్యే మదన్‌రెడ్డిని ఘనంగా సన్మానించారు. కార్యక్రమంలో రాష్ట్ర లేబర్ వెల్ఫేర్ బోర్డ్ చైర్మన్ దేవేందర్‌రెడ్డి, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ చంద్రాగౌడ్, ఏఎమ్‌సీ చైర్పర్సన్ అనసూయ, ఎంపీపీ జ్యోతి, వైస్ ఎంపీపీ వెంకటనర్సింగారావు, జడ్పీటీసీ బాబ్యానాయక్, ఆత్మకమిటీ చైర్మన్ వెంకట్‌రెడ్డి, టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు చంద్రశేఖర్, పట్టణ అధ్యక్షుడు భిక్షపతి, పీఏసీఎస్ చైర్మన్ రాజుయాదవ్, ఏఎమ్‌సీ వైస్ చైర్మన్ హబీబ్‌ఖాన్, మున్సిపల్ కమిషనర్ చాముండేశ్వరి, ఎంపీడీవో మార్టీన్ లూథర్, ఏంపీవో శ్రీనివాస్, టీఆర్ఎస్ నాయకులు అశోక్‌గౌడ్, నగేశ్, ఆంజనేయులుగౌడ్, కౌన్సిలర్లు, సర్పంచ్‌లు, ఎంపీటీసీలు పాల్గొన్నారు.