మునిపల్లి, సెప్టెంబర్ 1: ఉమ్మడి రాష్ట్రంలో కాంగ్రెస్ హ యాంలో కాలిపోయే మోటర్లు, పేలిపోయే ట్రాన్స్ఫార్మర్లతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారని మంత్రి హరీశ్‌రావు అన్నా రు. కంకోల్ గ్రామంలో ఆసరా పింఛన్లు పంపిణీ అనంతరం విలేకర్ల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో ఉప ముఖ్యమంత్రిగా పనిచేసినా అందోల్ నియోజకవర్గానికి దామోదార రాజనర్సిం హ చేసిందేమీ లేదని అన్నారు. మునిపల్లి, రాయికోడ్ మండలాల్లో తాగునీటి సమస్య, రోడ్లు బాగులేక ఆయా మండలాల ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారన్నారు. గత పాలకుల తీరుతో అందోల్ నియోజకవర్గం అభివృద్ధికి ఆమాడ దూరంలో ఉండిందన్నారు. తెలంగాణ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత అందోల్ అభివృద్ధి బాటలో పరుగులు పెడుతున్నదన్నారు. ఎమ్మెల్యే చంటి క్రాంతికిరణ్ కోరిక మేరకు సీఎం కేసీఆర్ రూ.70 కోట్లు మంజూ రు చేశారన్నారు. సింగూర్ ప్రాజెక్టులోకి తొందరలోనే గోదావరి నీళ్లు చేరుతాయన్నారు. దీంతో రైతుల ఇంట్లో సిరులు పండుతాయన్నారు. దళారులను నమ్మి మోసపోయి భూములు అమ్ముకోవద్దని, ముందు మరిన్ని మంచి రోజులు రావడం ఖాయమని అన్నారు.