గుమ్మడిదల, ఆగస్టు 29 : రాష్ట్రంలో దళిత కుటుంబాలకు ‘దళితబంధు’ సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టి సీఎం కేసీఆర్ దళిత బాంధవుడు అయ్యారని పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్‌రెడ్డి అన్నారు. సోమవారం మండలంలోని అనంతారం గ్రామానికి చెందిన 12 (యూనిట్ల) మంది దళిత కుటుంబాలకు 50 పాడి గేదెలు, నలుగురికి ట్రాక్టర్లు, ఒక యూనిట్ ఆటోను లబ్ధిదారులకు ఎమ్మెల్యే అందజేశారు. ఈ సందర్భం గా ఆయన మాట్లాడుతూ సీఎం కేసీఆర్ దళితుల అభ్యున్నతి కోసం దళితబంధు పథకాన్ని ప్రవేశపెట్టి పెద్దన్నగా నిలుస్తున్నారన్నారు. గతంలో దళితులు కూలీ పనులు చేసుకుంటూ బతుకుదెరువు కొనసాగించేవారని, నేడు స్వరాష్ట్రంలో యజమానులుగా నిలదొక్కుకుంటున్నారని హర్షం వ్యక్తంచేశారు. ఇటీవల తెలంగాణ అభివృద్ధిని జీర్ణించుకోని కొన్ని పత్రికలు విష ప్రచారం చేస్తున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఎన్ని విష ప్రచారాలు చేసినా అభివృద్ధిని అడ్డుకోలేరని గుర్తుచేశారు. దోమడుగు గ్రామంలో హెటిరో డ్రగ్స్ పరిశ్రమకు చెందిన రూ.60 లక్షల సీఎస్ఆర్ నిధులతో రోడ్ల పనులకు ఎమ్మెల్యే శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే హెటిరో డ్రగ్స్ పరిశ్రమ యాజమాన్యాన్ని అభినందించారు. మండల కేంద్రంలోని చంద్రారెడ్డి ఫంక్షన్ హాల్లో 685 మందికి ఆసరా పెన్షన్ అనుమతి పత్రాలు, 23 మంది లబ్ధిదారులకు కల్యాణలక్ష్మి, షాదీముబారక్ చెక్కులు అందజేశారు.
కార్యక్రమంలో జడ్పీటీసీ కుమార్‌గౌడ్, ఎంపీపీ సద్దిప్రవీణ, ఎంపీడీవో చంద్రశేఖర్, తహసీల్దార్ సుజా త, సర్పంచ్‌లు నర్సింహారెడ్డి, రాజశేఖర్, ఆలేటి నవీనాశ్రీనివాస్‌రెడ్డి, దీపానారేందర్రెడ్డి, శంకర్, ఆంజనేయులు, మమతావేణు, వాసవీదామోదర్రెడ్డి, రేణుకాస్వామి, కం జర్ల శ్రీనివాస్, ఎంపీటీసీలు కొత్తపల్లి ప్రభాకర్‌రెడ్డి, పద్మాకొండల్రెడ్డి, టీఆర్ఎస్ జిల్లా నాయకులు గోవర్ధన్‌రెడ్డి, నరేందర్‌రెడ్డి, సద్ది విజయభాస్కర్‌రెడ్డి, మండల అధ్యక్షుడు మహ్మద్ హుస్సేన్, ప్రధాన కార్యదర్శి శ్రీనివాస్‌రెడ్డి, యువత అధ్యక్షుడు భాస్కర్‌రెడ్డి, సోషల్ మీడియా అధ్యక్షుడు పయాజ్ షరీఫ్, నాయకులు చక్రపాణి, వినోద్‌గౌడ్, శ్రీనివాస్‌రెడ్డి, గోపాల్, మన్నె మహేశ్, ఉప సర్పంచ్‌లు, కార్యకర్తలు పాల్గొన్నారు.