రామాయంపేట, ఆగస్ట్టు 28 : విద్యార్థుల్లో సామాజిక బాధ్యత, సామాజిక సృహ కలిగించడానికి ఎన్ఎస్ఎస్ శిబి రాలు దోహదపడుతున్నాయి. ఎన్సీసీ విద్యార్థుల్లో దేశభక్తి, క్రమశిక్షణ పెంపొందిస్తుండగా, ఎన్ఎస్ఎస్ సామాజిక బాధ్య తలను వివరిస్తున్నది. ప్రభుత్వాలు, అధికారులు చేయలేని పనులను జాతీయ సేవా పథంలో విద్యార్థులు పల్లెబాట పట్టి ప్రజలను చైతన్యవంతులు చేయడమే కాకుండా గ్రామాభి వృద్ధికి కృషి చేస్తున్నారు. శ్రమదానం చేస్తూ వైద్య శిబిరాలు నిర్వహిస్తూ గ్రామస్తులతో శభాష్ అనిపించుకుంటున్నారు.
రామాయంపేట పట్టణంలోని దశాబ్ద కాలంగా ప్రభుత్వ జూనియర్ కళాశాల, స్నేహ డిగ్రీ కళాశాలల ఎన్ఎస్ఎస్ విద్యార్థులు పల్లె ప్రాంతాల అభివృద్ధ్దే లక్ష్యంగా కృషి చేస్తున్నారు.
ప్రభుత్వ కళాశాలలో ఎన్ఎస్ఎస్ కో ఆర్డినేటర్ బాలప్రకాశ్, స్నేహ డిగ్రీ కళాశాల కోఆర్డినేటర్ కిషన్ ఆధ్వర్యంలో విద్యార్థులు వలంటీర్లుగా ఏర్పడి పల్లెలకు వెళ్లి, వారం రోజుల పాటు వివిధ ఆంశాలపై ప్రజలను చైతన్యపరుస్తున్నారు. స్థానిక ప్రజాప్రతినిధుల సహకారంతో గ్రామస్తులకు స్వచ్ఛత, పరిసరాల శుభ్రత, ఆరోగ్య సంరక్షణ, మొక్కల పెంపకం, కాలుష్య నివారణ, మూఢ నమ్మకాల నిర్మూలన, సైబర్ నేరా లను వివరిస్తూ అవగాహన కల్పిస్తున్నారు. ప్రజలను చైతన్య పర్చడానికి ప్రధాన వీధుల్లో గ్రామసభ ఏర్పాటు చేసి, అవగాహన కల్పిస్తున్నారు.
పరిసరాల పరిశుభ్రత, నీటి వినియో గం, ఇతర అంశాలపై ఫ్లెక్సీలతో ర్యాలీ నిర్వహిస్తున్నారు. ప్రభుత్వ కళాశాల ఎన్ఎస్ఎస్ వలంటీర్లు రామాయంపేట పట్టణంతోపాటు చల్మెడ గ్రామంలో ఓ కాలనీకి రోడ్డు వేశారు. గొల్పర్తి గ్రామంలో అసాంఘిక కార్యకలాపాలకు అడ్డాగా ఉన్న పాఠశాలకు ప్రహరీ నిర్మించారు. స్నేహ కళాశాల ఎన్ఎస్ ఎస్ వలంటీర్లు దామరచెర్వు, రజాక్పల్లి, వెంకటాపూర్(ఆర్) తదితర గ్రామాల్లో వివిధ కార్యక్రమాలు నిర్వహించారు. విద్యార్థ్ధులంతా గ్రూపులుగా ఏర్పడి గ్రామస్తులకు ప్రభుత్వ పథకాల ప్రయోజనాలు, వాటిని వినియోగాన్ని వివరించారు. ప్రభుత్వం గ్రామాల అభివృద్ధ్దికి పుష్కలంగా నిధులు ఇస్తున్నదని, వాటిని సద్వినియోగం చేసుకోవాలని వివరించారు.
ప్రభుత్వ డిగ్రీ కళాశాల నుంచి ఏటా ఒక గ్రామంలో వారం రోజులపాటు ఎన్ఎస్ఎస్ ప్రత్యే క శిబిరం నిర్వహిస్తున్నాము. విద్యార్థులు చేస్తున్న సేవా కార్యక్రమాలకు ప్రజాప్రతినిధులు, అధికారులు సహకరిస్తున్నారు. ప్రజలతో కలిసి ఎన్ఎస్ఎస్ వలంటీర్లు శ్రమదానం చేస్తూ గ్రామాన్ని శుభ్రంగా మార్చుతున్నా రు. వ్యక్తిగత మరుగుదొడ్ల వినియోగంపై అవగాహన కల్పించడంతో ఒక గ్రామంలో ప్రజలు కొత్తగా మరుగుదొడ్లను నిర్మించుకున్నారు. విద్యార్థుల కృషికి ఇది ఒక నిదర్శన మాత్రమే. చెత్త సేకరణ, ప్లాస్టిక్ నిషేధం, మొక్కల పెంపకంపై విద్యార్థుల ప్రచారంతో ప్రజల్లో అవగాహన రావడంతోపాటు పాటిస్తున్నారు. ఎన్ఎస్ఎస్ శిబిరాలతో విద్యార్థులకు సామాజిక బాధ్యత లతోపాటు సమాజంపై అవగాహన కలుగుతున్నది.
– కృష్ణారెడ్డి, రామాయంపేట ప్రభుత్వ కళాశాల ప్రిన్సిపాల్
ఎన్ఎస్ఎస్లో భాగంగా విద్యా ర్థులు పల్లెల్లో వారం రోజులపాటు అక్కడే ఉండి ప్రధాన సమస్యలపై ప్రజలతో కలిసి శ్రమదానం చేస్తూ స్వ చ్ఛతపై అవగాహన కల్పిస్తారు. మురుగునీటి కాలువలు, వీధులను శుభ్రం చేస్తారు. చల్మెడ గ్రామంలోని ఓ కాలనీకి రోడ్డు వేశాం. గొల్పర్తి పాఠశాలకు ప్రహరీ నిర్మించి, గ్రామస్తుల అభినందనలను పొందారు. ఎన్ఎస్ఎస్ ప్రత్యేక శిబిరా లతో విద్యార్థుల్లో సమాజంపై క్షేత్రస్థాయిలో అవగాహన కలుగుతున్నది. భవిష్యత్లో విద్యార్థులు ఉత్తమ ప్రజా ప్రతినిధులుగా రాణిస్తారు. – బాలప్రకాశ్,
ప్రభుత్వ కళాశాల ఎన్ఎస్ఎస్ కోఆర్డినేటర్
ఎన్ఎస్ఎస్ ఆధ్వర్యంలో విద్యార్థులు నిర్వహిస్తున్న కా ర్యక్రమాలు కళాశాలకు పేరుప్రతిష్టలు తేవడమే కాకుం డా వలంటీర్లు చేస్తున్న పనులపై ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా రక్తదాన శిబిరాలను ఏ ర్పాటు చేస్తున్నాం. దీంతోపాటు మొక్కల పెంప కంపై ప్రజలకు విద్యార్థులు అవగాహన కల్పిస్తూ పర్యావరణ పరిరక్షణకు కృషి చేయిస్తున్నారు. గ్రా మస్తులతో శ్రమదాన కార్యక్రమాలు చేస్తున్నాం.
– రమేశ్, స్నేహ డిగ్రీ కళాశాల ఎన్ఎస్ఎస్ కో ఆర్డినేటర్