హుస్నాబాద్టౌన్/ చేర్యాల, ఆగస్టు 28 : పరిసరాల పరిశుభ్రతతో పాటు వ్యక్తిగత శుభ్రతను పాటిస్తేనే ఆరోగ్యంగా ఉంటామని హుస్నాబాద్ మున్సిపల్ చైర్పర్సన్ ఆకుల రజితావెంకన్న అన్నారు. పట్టణంలోని 11, 20వ వార్డుల్లో పదిగంటల పదినిమిషాల కార్యక్రమాన్ని ఆదివారం నిర్వహించారు.
ఈ సందర్భంగా వార్డుల్లో ఇంటింటా తిరుగుతూ పనికిరాని వస్తువుల్లో నిల్వ ఉన్న వర్షపు నీటిని పారబోయించడం, ఇంటితో పాటు పరిసరాలను ఎప్పటికప్పుడు పరిశుభ్రంగా ఉంచుకోవాలని సూచించారు. పరిశుభ్రత కోసం కనీసం పదినిమిషాల సమయాన్ని కేటాయించాలని ఆమె సూచించారు. మలేరియా, చికున్ గున్యా తదితర వ్యాధులు సంక్రమిస్తున్న తరుణంలో వ్యక్తిగత పరిశుభ్రతను సైతం ప్రతి ఒక్కరూ పాటించాలని చైర్పర్సన్ కోరారు. ఈ కార్యక్రమంలో వైస్చైర్