రామాయంపేట, ఆగస్టు 25 : శాంతియుతంగా ఉత్సవాలను నిర్వహించాలని రామాయంపేట సీఐ చంద్రశేఖర్‌రెడ్డి అన్నారు. గురువారం మండలంలోని అన్ని గ్రామాల గణేశ్ ఉత్సవ కమిటీ సభ్యులతో పోలీస్‌స్టేషన్‌లో శాంతి కమిటీ సమావేశం ఏర్పాటు చేసిన పలు సూచనలు సలహాలిచ్చారు. వినాయకులను ప్రతిష్ఠించేవారు మండపాలను పక్కాగా నిర్వహించాలన్నారు. మండపాల్లో నిషేధిత పదార్థాలు ఉండొద్దని సూచించారు.
ప్రజలకు ఇబ్బందులు కలుగకుండా మండపా లను ఏర్పాటు చేయాలని ఆదేశించారు. డీజే ఇతర సౌండ్ బాక్స్‌లను పెడితే చర్యలు తీవ్రంగా ఉంటాయని హెచ్చరిం చారు. ముందస్తుగా పోలీసు, విద్యుత్ శాఖల అధికారుల అనుమతి తీసుకుని మండపాలను ఏర్పాటు చేయాలన్నారు. హద్దు మీరితే కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. సమావేశం లో ఎస్సై రాజేశ్, అన్ని గ్రామాల సర్పంచ్‌లు పాల్గొన్నారు. త్వరలో సీఐ సర్కిల్ సమావేశాన్ని డీఎస్పీ ఆధ్వర్యంలో రా మాయంపేట పోలీస్‌స్టేషన్‌లో నిర్వహిస్తామని పేర్కొన్నారు.
నిజాంపేట, ఆగస్టు 25 : ప్రశాంత వాతావరణంలో గణేశ్ నవరాత్రత్సోవాలను నిర్వహించాలని ఎస్సై శ్రీనివాస్‌రెడ్డి అ న్నారు. స్థానిక పోలీస్‌స్టేషన్‌లో ప్రజాప్రతినిధులు, యువకులతో శాంతి సమావేశం నిర్వహించారు. గణేశ్ మండపాల నిర్వాహకులు ముందస్తుగా పోలీస్‌స్టేషన్ నుంచి అనుమతి పొందిన తర్వాతే విగ్రహాలను ప్రతిష్ఠించాలన్నారు. డీజేకు పర్మిషన్ లేదని, మత సామరస్యాన్ని కాపాడాలని కోరారు.
చిలిపిచెడ్, ఆగస్టు 25 : ఉత్సవాలను శాంతియుతంగా నిర్వహించాలని ఎస్సై మహ్మద్ గౌస్ తెలిపారు. చిలిపిచెడ్ పోలీస్‌స్టేషన్‌లో సర్పంచ్‌లు, యువజన సంఘాలు, వినాయ క ఉత్సవ నిర్వాహకులతో సమావేశాన్ని నిర్వహించారు. మం డపాలకు ముందస్తు అనుమతి తీసుకోవాలని సూచించారు. సమావేశంలో ఎంపీపీ వినోద, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.