హవేళీఘనపూర్, ఆగస్టు 24 : మెదక్ జిల్లాలో నీటి వనరులు పెరగడంతో పామాయిల్ సాగుకు అనుకూలంగా మారిందని, సాగుకు ప్రభుత్వం త్వరలోనే అనుమతులు మంజూరు చేయనున్నదని ఆర్థిక, వైద్యారోగ్య శాఖల మంత్రి హరీశ్‌రావు అన్నారు. బుధవారం మండలంలోని తొగిట గ్రామ రైతు ఉత్పత్తి సహకార సంఘం ప్రారంభోత్సవానికి మెదక్ ఎమ్మెల్యే పద్మాదేవేందర్‌రెడ్డితో కలిసి మంత్రి ముఖ్యఅతిథిగా హాజరయ్యారు.
ఈ సందర్భంగా తొగిటలో ఏర్పాటు చేసిన ఎరువుల గోదాం, ఫర్టిలైజర్ షాపులను ఆయన ప్రారంభించారు. అనంతరం రైతులను ఉద్దేశించి మాట్లాడుతూ తొగిటలో రైతులకు అవసరమైన రైతు ఉత్పత్తి సేవా కేంద్రాన్ని ప్రారంభించుకోవడం సంతోషకరమన్నారు. రైతులు కేవలం వరి సాగు మాత్రమే కాకుండా ఇతర పం టల వైపు మొగ్గు చూపాలని సూచించారు. టెక్నాలజీని వాడుతూ మంచి దిగుబడులు సాధించాలని కోరారు. రసాయన ఎరువుల వాడకం తగ్గించి సేం ద్రియ సాగు చేపట్టాలన్నారు. రైతు ఉత్పత్తి సేవా కేం ద్రం ద్వారా ధాన్యం ప్రాసెసింగ్ చేస్తే మంచి ధర పొందవచ్చని తెలిపారు.
మెదక్ జిల్లాలో వారం పది రోజుల్లో పామాయిల్ తోటల సాగుకు ప్రభుత్వ అనుమతి ఇవ్వనున్నదని తెలిపారు. పామాయిల్ సాగు చేయడం ద్వారా రైతులు తమ పొలాలను కౌలుకు ఇస్తే ఎకరాకు 1.20 లక్షలు, సొంతగా సాగు చేసుకుంటే రూ.2లక్షల వరకు దిగుబడి రానున్నదని మంత్రి తెలిపారు. కార్యక్రమంలో మెదక్ ఎంపీ కొత్త ప్రభాకర్‌రెడ్డి, ఎమ్మెల్యే పద్మాదేవేందర్‌రెడ్డి, ఎంపీపీ శేరి నారాయణరెడ్డి, జడ్పీ వైస్ చైర్పర్సన్ లావణ్యరెడ్డి, ఎంపీటీసీల ఫోరం జిల్లా అధ్యక్షుడు కసిరెడ్డి మాణిక్యరెడ్డి, సర్పంచ్ మంద శ్రీహరి, ఆత్మ కమిటీ చైర్మన్ అంజాగౌడ్, రైతుబంధు సమితి జిల్లా సభ్యుడు కొంపల్లి సుభాశ్‌రెడ్డి, టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు శ్రీనివాస్‌రెడ్డి, సర్పంచ్‌లు శ్రీను, ఎంపీటీసీ రాజయ్య, మెదక్ పీఎసీఎస్ డైరెక్టర్ సాయిలు, టీఆర్ఎస్ నాయకులు మేకల సాయిలు, నరేందర్‌రెడ్డి, శ్రీనివాస్‌రెడ్డి, రాంచంద్రారెడ్డి పాల్గొన్నారు.