తెలంగాణ క్రీడాకారులు అంతర్జాతీయ స్థాయిలో సత్తాచాటి దేశానికి, రాష్ర్టానికి గౌరవం తేవాలని ఆర్థిక, వైద్యారోగ్యశాఖల మంత్రి హరీశ్‌రావు పిలుపునిచ్చారు. మెదక్ జిల్లా కేంద్రంలోని ఇందిరాగాంధీ స్టేడియంలో ఖేలో ఇండియా, సాట్స్, డీఎంఈ నిధులు రూ. 7.22 కోట్లతో నిర్మించిన సింథటిక్ ట్రాక్‌ను బుధవారం ఆయన ప్రారంభించారు. అనంతరం ఇదే మైదానంలో 8వ తెలంగాణ స్టేట్ జూనియర్ అథ్లెటిక్స్ పోటీలను ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. గచ్చిబౌలి స్టేడియం తర్వాత పెద్ద సింథటిక్ ట్రాక్‌ను మెదక్ స్టేడియంలో నిర్మించుకోవడం సంతోషంగా ఉందన్నారు.
మెదక్ మున్సిపాలిటీ, ఆగస్టు 24: తెలంగాణ క్రీడాకారులు అంతర్జాతీయ స్థాయిలో సత్తా చాటి దేశానికి, రాష్ర్టానికి గౌరవం తీసుకురావాలని ఆర్థిక, వైద్య, ఆరోగ్యశాఖల మంత్రి హరీశ్‌రావు పిలుపునిచ్చారు. మెదక్ జిల్లా కేంద్రంలోని ఇందిరాగాంధీ స్టేడియంలో ఖేలో ఇండియా, సాట్స్, డీఎంఈ నిధులు రూ.7.22 కోట్లతో నిర్మించిన సింథటిక్ ట్రాక్‌ను బుధవారం మెదక్ ఎంపీ కొత్త ప్రభాకర్‌రెడ్డి,, స్థానిక ఎమ్మెల్యే పద్మాదేవేందర్‌రెడ్డి, శాఫ్ చైర్మన్ వెంకటేశ్వర్‌రెడ్డి, కలెక్టర్ హరీశ్‌తో కలిసి మంత్రి ప్రారంభించారు. అనంతరం 8వ తెలంగాణ స్టేట్ జూనియర్ అథ్లెటిక్స్ చాంపియన్‌షిప్ జెండాను మంత్రి ఆవిష్కరించి, క్రీడాజ్యోతిని వెలిగించి పోటీలు ప్రారంభించారు. క్రీడాకారులు మార్చ్ఫాస్ట్ నిర్వహించగా, గౌరవ వందనం స్వీకరించారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ మెదక్ స్టేడియాన్ని చూస్తుంటే గచ్చిబౌలి స్టేడియం గుర్తొస్తున్నట్లు చెప్పారు. గచ్చిబౌలి స్టేడియంలోని పెద్ద సింథటిక్ ట్రాక్ తర్వాత మెదక్ స్టేడియంలోనే అంతపెద్ద సింథటిక్ ట్రాక్ ఉందన్నారు. ఈ సింథటిక్ ట్రాక్‌పై మొదటిసారిగా 8వ తెలంగాణ స్టేట్ జూనియర్ అథ్లెటిక్స్ చాంపియన్‌షిప్ పోటీలు నిర్వహించడం సంతోషంగా ఉందని తెలిపారు. మెదక్ జిల్లా రాష్ట్రస్థాయి జూనియర్ అథ్లెటిక్స్ పోటీలకు ప్రాతినిథ్యం వహించడం ఎంతో ఆనందంగా ఉందన్నారు. క్రీడాకారులు ఒలింపిక్స్, ఆసియా గేమ్స్‌లో పతకాలు సాధించి అంతర్జాతీయ స్థాయిలో దేశానికి, రాష్ర్టానికి పేరు ప్రఖ్యాతలు తేవాలని పిలుపునిచ్చారు. ఎమ్మెల్యే పద్మాదేవేందర్‌రెడ్డి ప్రత్యేక శ్రద్ధతో స్టేడియంలో అద్భుతమైన సింథటిక్ ట్రాక్ నిర్మించుకున్నామన్నారు. క్రీడాకారులు ఈ చక్కటి అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని క్రీడల్లో రాణించాలని కోరారు. క్రీడాకారులకు అన్ని సౌకర్యాలు కల్పించాలని కలెక్టర్, ఎస్పీలను ఆదేశించారు. క్రీడాకారులకు భోజన వసతి కల్పిస్తున్న ఎమ్మెల్యే పద్మాదేవేందర్‌రెడ్డికి మంత్రి అభినందించారు. ఈ సందర్భంగా 33 జిల్లాల నుంచి పోటీల్లో పాల్గ్గొంటున్న 1100 మంది క్రీడాకారులకు శుభాకాంక్షలు తెలిపారు.

హైదరాబాద్ తర్వాత మెదక్‌లోనే సింథటిక్ కోర్టు..
– మెదక్ ఎమ్మెల్యే పద్మాదేవేందర్‌రెడ్డి
గచ్చిబౌలి స్టేడియం తర్వాత రాష్ట్రంలో మెదక్‌లో తప్పా ఎక్కడా ఇలాంటి సింథటిక్ నిర్మాణం జరుగలేదని, వరంగల్‌లో సింథటిక్ నిర్మాణ పనులు చేపడుతున్నట్లు ఎమ్మెల్యే పద్మాదేవేందర్‌రెడ్డి తెలిపారు. సింథటిక్ ట్రాక్ నిర్మాణానికి సహకరించిన మంత్రి హరీశ్‌రావు, మెదక్ ఎంపీ ప్రభాకర్‌రెడ్డికి ఎమ్మెల్యే కృతజ్ఞతలు తెలిపారు. క్రీడాకారులు సింథటిక్ ట్రాక్‌ను వినియోగించుకొని క్రీడల్లో రాణించాలన్నారు. ఈ స్టేడియంలో రాష్ట్రస్థాయి పోటీలు ఎన్నో నిర్వహించుకున్నామని, సింథటిక్ ట్రాక్ నిర్మాణం తరువాత తొలిసారిగా రాష్ట్రస్థాయి జూనియర్ అథ్లెటిక్స్ పోటీలు నిర్వహించుకోవడం సంతోషంగా ఉందని చెప్పారు. మున్ముందు సైతం రాష్ట్ర, జాతీయస్థాయి పోటీల నిర్వహణకు తన సహకారం ఎల్లవేళలా ఉంటుందని ఎమ్మెల్యే పద్మాదేవేందర్‌రెడ్డి అన్నారు.
మెదక్‌లో సింథటిక్ ట్రాక్ నిర్మించడం శుభ పరిణామం
– శాఫ్ చైర్మన్ వెంకటేశ్వరరెడ్డి
మెదక్ స్టేడియంలో సింథటిక్ ట్రాక్ నిర్మించుకోవడం శుభపరిణామని, మెదక్‌లో ఇంత పెద్ద స్టేడియం ఉండడం క్రీడల అభివృద్ధికి దోహదం చేస్తుందని శాఫ్ చైర్మన్ వెంకటేశ్వర్‌రెడ్డి అన్నారు. క్రీడాకారులు పీటీ ఉష, కరణం మల్లేశ్వరీలా తయారు కావాలన్నారు. ఇటీవల జరిగిన కామన్వెల్త్ గేమ్స్‌లో మన దేశం 5వ స్థానంలో నిలిచిందని గుర్తు చేశారు. మన దేశం సాధించిన పతకాల్లో హర్యానా తర్వాత తెలంగాణ క్రీడాకారులే ఎక్కువ పతకాలు సాధించడం గర్వంగా ఉందన్నారు. ప్రభుత్వం క్రీడలకు ఎన్నో నిధులు కేటాయిస్తోందని, మరిన్ని నిధులు పెంచితే క్రీడాకారులకు ఎంతో మేలు జరుగుతుందన్నారు.
అట్టహాసంగా ప్రారంభం..
మెదక్‌లో బుధవారం ప్రారంభమైన రాష్ట్రస్థాయి జూనియర్ అథ్లెటిక్స్ పోటీలు గురువారంతో ముగియనున్నాయి. బుధవారం హైజంప్, లాంగ్‌జంప్, డిస్కస్‌త్రో, పరుగు పందెం తదితర పోటీలు నిర్వహించారు. తొలిరోజు విజేతలకు మంత్రి హరీశ్‌రావు, ఎమ్మెల్యే పద్మాదేవేందర్‌రెడ్డి, మెదక్ ఎంపీ ప్రభాకర్‌రెడ్డి పతకాలు అందజేశారు. ఆద్యంతం కోలాహలంగా పోటీలు జరిగాయి. క్రీడాకారులు, క్రీడా శిక్షకులు, క్రీడా అభిమానులు తరలివచ్చారు. కార్యక్రమంలో ఇఫ్కో డైరెక్టర్ దేవేందర్‌రెడ్డి, జిల్లా అదనపు కలెక్టర్ ప్రతిమాసింగ్, తెలంగాణ అథ్లెటిక్స్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి సారంగపాణి, మున్సిపల్ చైర్మన్ చంద్రపాల్, వైస్ చైర్మన్ మల్లికార్జున్‌గౌడ్, ఎస్పీ రోహిణి ప్రియదర్శిని, జిల్లా క్రీడల అధికారి నాగరాజు, డీఎంహెచ్‌వో వెంకటేశ్వర్రావు, జిల్లా అథ్లెటిక్స్ అసోసియేషన్ అధ్యక్ష కార్యదర్శులు వెంకటరమణ, మధుసూదన్, సొసైటీ చైర్మన్ హనుమంత్‌రెడ్డి, స్పోర్ట్స్ అసోసియేషన్ సభ్యులు శివ, జుబేర్, కొండ శ్రీను, పీఈటీలు నాగరాజు, దేవేందర్‌రెడ్డి, శ్రీనివాస్‌రావు, సుజాత, మున్సిపల్ కౌన్సిలర్లు, ప్రజాప్రతినిధులు, అధికారులు, టీఆర్ఎస్ నాయకులు తదితరులు పాల్గ్గొన్నారు.