మెదక్, ఆగస్టు 23 (నమస్తే తెలంగాణ) : పేదల సొంతింటి కలను రాష్ట్ర ప్రభుత్వం నెరవేరుస్తున్నది. సీఎం కేసీఆర్ దిశానిర్దేశం మేరకు రాష్ట్రవ్యాప్తంగా ఎంపిక చేసిన ప్రాంతాల్లో అధికారులు డబుల్ బెడ్రూం ఇండ్లను నిర్మించి లబ్ధిదారులకు అందజేస్తున్నారు. మెదక్ జిల్లాకు 4,965 ఇండ్లను కేటాయించగా, ఇప్పటివరకు 2,344 పూర్తయ్యాయి. జిల్లా కేంద్రం శివారులో పిల్లికోటల్ వద్ద వెయ్యి ఇండ్లను సిద్ధం చేయగా, 2,656 మంది దరఖాస్తు చేసుకున్నారు. వీరిలో 1016 మంది అర్హులను గుర్తించిన అధికారులు, మొదటి విడతలో 561 మందిని ఎంపిక చేశారు. వీరికి నేడు మంత్రి హరీశ్‌రావు పట్టాలు అందజేసి, సామూహిక గృహప్రవేశాలు చేయించనున్నారు. అర్హుల ఎంపికలో ఎలాంటి అవకతవకలు జరుగుకుండా పారదర్శకంగా సర్వే నిర్వహించి జాబితాను రూపొందించారు. మరుగుదొడ్లు, డ్రైనేజీ వ్యవస్థ, విద్యుద్ధీకరణ, తాగునీటి సదుపాయం, అంతర్గత రోడ్లు తదితర మౌలిక వసతుల కోసం ప్రభుత్వం రూ.6 కోట్లు ఖర్చు చేసింది.
జిల్లా కేంద్రమైన మెదక్ పట్టణంలోని పిల్లికోటల్ సమీపంలో నిర్మించిన డబుల్ బెడ్ రూం ఇండ్ల పంపిణీ కార్యక్రమం బుధవారం ఆర్థిక, వైద్యారోగ్య శాఖల మంత్రి తన్నీరు హరీశ్‌రావు చేతుల మీదుగా జరుగనున్నది. లబ్ధిదారులందరూ సామూహికంగా గృహ ప్రవేశాలు చేయనున్నారు. ఇందుకోసం అధికార యంత్రాంగం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది.
మొదటి విడతలో 561 మందికి..
జిల్లా కేంద్రంలో మొదటి విడతలో 561 మంది లబ్ధిదారులకు డబుల్ బెడ్రూం ఇండ్లను కేటాయించారు. పిల్లికోటల్ వద్ద వెయ్యి ఇండ్లు నిర్మించారు. ఇందులో 561 ఇండ్లను మొదటి విడతలో పంపిణీ చేయడానికి అధికారులు అన్ని ఏర్పా ట్లు పూర్తి చేశారు. లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియపై మంత్రి హరీశ్‌రావు, ఎమ్మెల్యే పద్మాదేవేందర్‌రెడ్డి, మెదక్ కలెక్టర్ హరీశ్ ప్రత్యేక శ్రద్ధ పెట్టారు. రాజకీయ ఒత్తిళ్లు లేకుండా, పారదర్శకంగా లబ్ధిదారులను ఎంపిక చేశారు. రెవెన్యూ, మున్సిపల్ అధికారులు ఇచ్చిన జాబితా ప్రకారం ఇంటింటా సర్వే చేపట్టారు. ఇంటి సర్వే విషయంలో చుట్టు పక్కల వారిని కూడా విచారించి సర్వేను పకడ్బందీగా నిర్వహించారు. జిల్లా కేంద్రమైన మెదక్‌లో మొత్తం 2,656 మంది ఇండ్లు లేని పేదలు దరఖాస్తులు చేసుకోగా, ఇందులో 1016 మందిని అర్హులుగా గుర్తించారు. మొదటి విడతలో పూర్తయిన 561 ఇండ్లను పంపిణీ చేయాలని నిర్ణయించారు.
మౌలిక సదుపాయాలకు రూ.6 కోట్లు
పూర్తయిన డబుల్ బెడ్రూం ఇండ్లలో మౌలిక సదుపాయాల కల్పన కోసం ప్రభుత్వం ఇటీవల రూ.6 కోట్లు మంజూరు చేసింది. ఈ నిధులతో డబుల్ బెడ్రూం ఇండ్లలో మరుగుదొడ్లు, డ్రైనేజీ వ్యవస్థ, విద్యుద్ధీకరణ, తాగునీటి సదుపాయం, అంతర్గత రోడ్లు మొదలగు పనులు చేపట్టారు. డబుల్ బెడ్రూం ఇండ్లకు పేయిటింగ్, విద్యుత్ కనెక్షన్లు, ఏ బ్లాక్ వారికి ఆ బ్లాక్‌లో ఉండేవిధంగా అన్ని ఏర్పాట్లు చేశారు. పంచాయతీరాజ్, మున్సిపల్, రెవెన్యూ శాఖల అధికారులు దగ్గరుండి పనులను చేయిస్తున్నారు.
అన్నిశాఖల మధ్య సమన్వయంతో…
అధికారుల సమన్వయంతోనే డబుల్ బెడ్రూం ఇండ్లు త్వరగా పూర్తయ్యాయి. రెవెన్యూ అధికారులు భూ సేకరణ కార్యక్రమాన్ని త్వరగా పూర్తిచేయడంతోనే ఇండ్ల నిర్మాణం ముందుకు సాగాయి. కొన్నిచోట్ల ఇబ్బందులు ఉన్నా వాటిని అధిగమిస్తూ భూ సేకరణను పూర్తి చేశారు. అన్ని శాఖల సమన్వయంతోనే విద్యుత్, డ్రైనేజీ, తాగునీరు, అంతర్గత రోడ్లు, మరుగుదొడ్లు తదితర పనులు చేపట్టారు.
పారదర్శకంగా లబ్ధిదారుల ఎంపిక
మెదక్, ఆగస్టు 23 (నమస్తే తెలంగాణ) : మెదక్ పట్టణంలోని పిల్లికోటల్ సమీపంలో నిర్మించిన డబుల్ బెడ్రూం ఇండ్ల ఎంపిక ప్రక్రియ పారదర్శకంగా జరుగుతుందని మెదక్ ఎమ్మెల్యే పద్మాదేవేందర్‌రెడ్డి అన్నారు. మంగళవారం మెదక్ కలెక్టరేట్లో లబ్ధిదారుల సమక్షంలో డ్రా పద్ధతిలో ఇండ్లను కేటాయించినట్లు తెలిపారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన డబుల్ బెడ్ రూం ఇండ్ల నిర్మాణాన్ని మెదక్ పట్టణంలోని పిల్లికోటల్‌లో నిర్మించినట్లు చెప్పారు. ఇక్కడ వెయ్యి ఇండ్లను నిర్మించగా, మొదటి విడతలో 561 మందికి పట్టాలు పంపిణీ చేయనున్నట్లు తెలిపారు. మంత్రి హరీశ్‌రావు చొరవతో డబుల్ బెడ్ రూం ఇండ్లకు మౌలిక సదుపాయాల కోసం రూ.6 కోట్లు కేటాయించారని గుర్తుచేశారు. దీంతో విద్యుత్, డ్రైనేజీ వ్యవస్థ, తాగునీటి సదుపాయం, మరుగుదొడ్లతో పాటు తదితర పనులను చేపట్టనున్నట్లు చెప్పారు. డబుల్ బెడ్ రూం ఇండ్ల ఎంపికలో ఎలాంటి పైరవీలకు ఆస్కారం లేదని, లబ్ధిదారులు ఎవ రూ కూడా డబ్బులు ఇవ్వవద్దని సూచించారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ చంద్రపాల్, వైస్ చైర్మన్ మల్లికార్జున్‌గౌడ్, ఆర్డీవో సాయిరాంతో పాటు మెదక్ పట్టణంలోని లబ్ధిదారులు పాల్గొన్నారు.
మెదక్ జిల్లాలో ఇలా..
మెదక్ జిల్లాలో మొత్తం 4,965 డబుల్ బెడ్రూం ఇండ్లు మంజూరయ్యాయి. ఇందులో 3,644 ఇండ్ల నిర్మాణాలు ప్రారంభించారు. ఇప్పటి వరకు 2,344 ఇండ్లు పూర్తయ్యాయి. 1,300 ఇండ్లు ఆయా దశల్లో ఉన్నాయి. జిల్లాలో 4,965 ఇండ్లకు గాను ప్రభుత్వం రూ.155.35 కోట్లు మంజూరు చేసింది. జిల్లా కేంద్రంలోని పిల్లికోటల్ సమీపంలో వెయ్యి ఇండ్లను నిర్మించారు. ఇందులో బుధవారం 561 ఇండ్లను లబ్ధిదారులకు కేటాయించారు. మంత్రి హరీశ్‌రావు, ఎమ్మెల్యే పద్మాదేవేందర్‌రెడ్డి, కలెక్టర్ హరీశ్ ఇండ్ల పట్టాలు పంపిణీ చేసి సామూహిక గృహ ప్రవేశాలు చేయనున్నారు.
అర్హులైన పేదలకు ఇండ్లు కేటాయించాం
అర్హులైన పేదలకు ఇం డ్లను కేటాయించాం. మొద టి విడతలో 561 మందిని ఎంపిక చేశాం. వీరికి నేడు ఇండ్ల పట్టాలు అందజేస్తాం. ఎలాంటి పైరవీలకు ఆస్కా రం లేదు. ఒక్క పైసా ఖర్చు లేకుండా నిరుపేదలందరికీ గూడు కల్పించాలన్న సంకల్పంతోనే ప్రభు త్వం డబుల్ బెడ్రూం ఇండ్ల పథకానికి శ్రీకారం చుట్టిం ది. బుధవారం మంత్రి హరీశ్‌రావు చేతుల మీదుగా మెదక్‌లో ఇండ్ల పట్టాలను లబ్ధిదారులకు అందజేస్తాం. తర్వాత సామూహిక గృహ ప్రవేశాలు చేస్తారు.
-పద్మాదేవేందర్‌రెడ్డి, మెదక్ ఎమ్మెల్యే