రామాయంపేట, ఆగష్టు 23 : మహిళలు వృత్తిలో నైపుణ్యం సాధించి ఆర్థికాభివృద్ధి సాధించాలని మెదక్ ఎమ్మెల్యే పద్మాదేవేందర్రెడ్డి అన్నారు. మంగళ వారం రామాయంపేట పట్టణంలోని న్యాక్ అధ్వర్యంలో కుట్టుశిక్షణా శిబిరంలో శిక్షణ పూర్తి చేసుకున్న భవన నిర్మాణ కార్మిక కుటుంబాలు 44 మంది మహిళా శిక్షకులకు ప్రభుత్వం ద్వా రా కుట్టు మిషన్లను అందజేశారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ న్యాక్ ఆధ్వర్యంలో రామాయంపేటలో భవన నిర్మాణ కార్మికులకు, మహిళలకు కుట్టుశిక్షణలో భాగంగా శిక్షణనివ్వడం సం తోషించదగ్గ విషయమన్నారు. కుట్టుమిషన్ల ద్వారా ఎక్కడైనా దుకాణాలు పెట్టుకుంటే ప్రభుత్వం పైలట్ ప్రాజెక్టు కింద రుణ సదుపాయాన్ని కూడా కల్పిస్తున్నదన్నారు. వారి తో పాటు భవన నిర్మాణ రంగ కార్మికులకు కూడా న్యాక్ అధ్వర్యంలో వివిధ రకాల వృత్తుల్లో శిక్షణ ఇవ్వనున్నామన్నారు. అనంతరం ఎమ్మెల్యేను సన్మానించారు. ఈ కార్యక్రమంలో రామాయంపేట న్యాక్ రామాయంపేట ఇన్చార్జి నిజామొద్దీన్, టైలరింగ్ శిక్షకురాలు భక్తమాల, ఏఎల్వో రాజు, బాదె చంద్రం, పట్టణ నాల్గవ వార్డు కౌన్సిలర్ నాగరాజు ఉన్నారు.