మెదక్ మున్సిపాలిటీ/హవేళీఘనపూర్,ఆగస్టు 24 : చదువుతో పాటు క్రీడల్లో రాణించాలని ఎమ్మెల్యే పద్మాదేవేందర్‌రెడ్డి పిలుపునిచ్చారు. బుధవారం నుంచి రెండు రోజుల పాటు మెదక్‌లో జరిగే రాష్ట్రస్థాయి జూనియర్ అథ్లెటిక్స్ పోటీల్లో పాల్గోనే తెలంగాణ గురుకుల పాఠశాల బాలికలకు ట్రాక్‌షూట్ మంగళవారం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో అందజేశారు. సీఎం కేసీఆర్ ఆరోగ్యకరమైన తెలంగాణ కావాలని విద్య, క్రీడలకు అధిక నిధులు కేటాయిస్తున్నారన్నారు. రాష్ట్రస్థాయి పోటీల్లో రాణించాలని అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఎంపీపీల ఫోరం అధ్యక్షులు హరికృష్ణ, జిల్లా అథ్లెటిక్స్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి మధు, పీటీఈలు చరణ్, శ్రీనివాస్‌రావు టీఆర్ఎస్ పట్టణాధ్యక్షుడు గంగాధర్, బండ నరేందర్, గోపాలకృష్ణ తదితరులు పాల్గొన్నారు.
తీజ్ ఉత్సవాల్లో పాల్గొన్న ఎమ్మెల్యే
హవేళీఘనపూర్ మండల పరిధిలోని స్కూల్ తండాలో గిరిజనులు నిర్వహిస్తున్న తీజ్ ఉత్సవాల్లో మెదక్ టీఆర్ఎస్ జిల్లా అధ్యక్షురాలు, మెదక్ ఎమ్మెల్యే పద్మాదేవేందర్‌రెడ్డి పాల్గొని పూజలు నిర్వహించారు. అనంతరం స్కూల్ తండాలో నిర్మించనున్న అదనపు తరగతి గదుల నిర్మాణానికి ఎమ్మెల్యే పద్మాదేవేందర్‌రెడ్డి భూమిపూజ చేశారు. తండావాసుల విజ్ఞప్తి మేరకు కమ్యూనిటీ హాల్ నిర్మాణానికి రూ.5లక్షలు మంజూరు చేస్తానని హామీనిచ్చారు. ఈ కార్యక్రమంలో జడ్పీవైస్ లావణ్యరెడ్డి, ఆత్మ కమిటీ చైర్మన్ అంజాగౌడ్, ఎంపీటీసీ మంగ్యా, సర్పంచ్ యశోద, ఎంపీడీవో శ్రీరామ్, మాజీ సర్పంచ్ మేకల సాయిలు, టీఆర్ఎస్ నాయకులు రాంచంద్రారెడ్డి తదితరులు పాల్గొన్నారు.
రేణుకాంబ ఆలయంలో పూజలు చేసిన ఎమ్మెల్యే
శ్రావణ మాసం చివరి మంగళవారం పురస్కరించుకొని జిల్లా కేంద్రంలోని పసుపులేరు ఒడ్డున గల రేణుకాంబ ఆలయంలో సామూహిక కుంకుమార్చన నిర్వహించారు. ఎమ్మెల్యే పద్మాదేవేందర్‌రెడ్డి పూజల్లో పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యకమాల్లో ఆలయ కమిటీ ఆధ్యక్షుడు కొండన్ సురేందర్‌గౌడ్, గౌడ సంఘం అధ్యక్షుడు గడ్డమీది కృష్ణాగౌడ్, మున్సిపల్ వైస్ చైర్మన్ మల్లికార్జున్‌గౌడ్ పాల్గొన్నారు. న్యాక్ ఆధ్వర్యంలో ఎస్సీ కార్పొరేషన్ ద్వారా మూడు నెలల శిక్షణ పూర్తి చేసుకున్న 26 మంది మహిళలకు కుట్టు మిషన్లు, ధ్రువపత్రాలను మంగళవారం ఎమ్మెల్యే అందజేశారు.