చేగుంట/నర్సాపూర్/రామాయంపేట/కొల్చారం, ఆగస్టు 23 : తెలంగాణలో స్వాతంత్య్ర వజ్రోత్సవ వేడుకలు దేశం గర్వించేలా నిర్వహించి ప్రతి ఒక్కరిలో జాతీయ భావాన్ని పెంపోందించాయని చేగుంట ఎంపీపీ మాసుల శ్రీనివాస్,రామాయంపేట సీఐ చంద్రశేఖర్‌రెడ్డి అన్నారు. మండల కేంద్రమైన చేగుంటలోని మండల పరిషత్ కార్యాలయ ఆవరణలో ఎంపీపీ మాసుల శ్రీనివాస్ అధ్యక్షతన మంగళవారం భారత వజ్రోత్సవల ముగింపు సమావేశాన్ని ఏర్పాటు చేశారు. అనంతరం క్రీడల్లో గెలుపొందిన విద్యార్థులకు బహుమతులను అందజేశారు. తెలంగాణ మెడికల్ అసోసియేషన్ కోశాధికారి తొడుపునూరి రాజు, కిరాణాం అసోసియేషన్ నాయకులు తొడుపునూరి మహేశ్ వజ్రోత్సవ వేడుకలకు రూ.10వేలు అందించడంపై ఎంపీపీ అభినందించారు. ఈ కార్యక్రమంలో రెడ్డిపల్లి సొసైటీ చైర్మన్ మ్యాకల పరమేశ్,ఎంపీటీసీలు అయిత వెంకటలక్ష్మి,బక్కి లక్ష్మి,బింగి గణేశ్,తహసీల్దార్ లక్ష్మణ్‌బాబు,ఏంపీవో సంతోష్, ఎపీఎం లక్ష్మీనర్సమ్మ, జిల్లా క్రీడల అసోసియేషన్ అధ్యక్షుడు నాగరాజు, పాఠశాల హెచ్ఎంలు,కె గంగబాయి,రమేశ్,వెంకట్రాంరెడ్డి,వివిధ పాఠశాలలకు చెందిన పీఈటీలు పాల్గొన్నారు.
నర్సాపూర్‌లో..
75వ భారత స్వాతంత్య్ర వజ్రోత్సవాల్లో భాగంగా విద్యార్థులకు నిర్వహించిన పలు క్రీడల్లో గెలుపొందిన విజేతలకు మంగళవారం మున్సిపల్ చైర్మన్ మురళీయాదవ్ బహుమతులు అందజేశారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ చాముండేశ్వరి, కౌన్సిలర్స్ యాదగిరి, రాంచందర్, టీఆర్ఎస్ నాయకులు రమేశ్ యాదవ్, ఆం జనేయులు గౌడ్, ఉపాధ్యాయుడు సామ్యానాయక్ మున్సి పల్ సిబ్బంది పాల్గొన్నారు.
రామాయంపేటలో..
కాట్రియాల గ్రామాన్ని అన్ని రంగాలో అభివృద్ధి చేస్తానని సర్పంచ్ మైలారం శ్యాములు అన్నారు.మంగళవారం రామాయంపేట మండంలోని కాట్రియాలలో ముగ్గుల పోటీల్లో ప్రతిభను చాటిన విద్యార్థులకు బహుమతులను అందజేశారు. అభివృద్ధికి సహకరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఉపసర్పంచ్ స్రవంతి, గ్రామ వార్డు సభ్యులు ఉన్నారు. కొల్చారంలో స్వాతంత్ర భారత వజ్రోత్సవాలు ముగింపు వేడుకలు మంగళవారం సర్పంచ్ గోదావరి అధ్యక్షతన జరిగాయి. ఈ కార్యక్రమానికి ఎంపీడీవో ప్రవీ ణ్, ఎంఈవో నీలకంఠం ముఖ్య అతిథిగా హాజరై సిబ్బందిని సన్మానించారు.