మెదక్ అర్బన్, ఆగస్టు22: అర్జీదారుల సమస్యలను వెంటనే పరిష్కరించాలని మెదక్ జిల్లా అదనపు ఎస్పీ బాలస్వామి అధికారులకు సూచించారు. సోమవారం మెదక్ జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయంలో ఎస్పీ రోహిణి ప్రియదర్శిని ఆదేశాల మేరకు ప్రజావాణి కార్యక్రమాన్ని నిర్వహించారు. జిల్లా నలుమూలల నుం చి వచ్చిన అర్జీదారుల నుంచి వినతులు స్వీకరించారు. మనోహరాబాద్ మండ లం జీడిపల్లి గ్రామానికి చెందిన సోల్లుగారి యాదయ్య ఫిర్యాదు చేశారు. ఇందులోఓ తమ గ్రామ శివారులోని సర్వే నంబర్ 119లో ఉన్న పోరంబోకు భూమిని తాను 60 ఏండ్లుగా సాగు చేస్తున్నానని, తమ గ్రామానికి చెందిన కొందరు వ్యక్తులు భూమిని కబ్జా చేసేందుకు యత్నిస్తున్నారని తెలిపారు. తమ భూమి గెట్లపై ఉన్న చెట్లను నరికి ట్రాక్టర్‌తో చదును చేశారని పేరొన్నారు. తనకు న్యాయం చేయాలని ఫిర్యాదులో పేర్కొనగా, చట్టప్రకారం ఫిర్యాదుదారుడికి న్యాయం చేయాలని మనోహరాబాద్ ఎస్సైకి సూచించారు. చిలిపిచెడ్ మండలం బద్రియ తండాకు చెందిన బుజ్జి తన భూమి కబ్జాకు గురైందని ఫిర్యాదు చేశారు. అందులో చిట్కుల్ గ్రామంలోని సర్వే నంబర్ 208/ యు 2/3 లో 20 గుంటల భూమి ఉందని, కొన్నేండ్లుగా తాము సంగారెడ్డిలో ఉంటున్నామని, ఇదే అదునుగా భావించిన కొందరు వ్యక్తులు తమ భూమిని కబ్జా చేశారని పేర్కొన్నారు. తనకు న్యాయం చేయాలని ఫిర్యాదు చేయగా ఫిర్యాదికి తగిన న్యాయం చేయాలని చిలిపిచెడ్ ఎస్సైకి ఆయన సూచించారు.