మెదక్‌రూరల్, ఆగస్టు22: దైవ చింతనతోనే మానసిక ప్రశాంతత లభిస్తుందని మెదక్ ఎమ్మెల్యే పద్మాదేవేందర్‌రెడ్డి అన్నారు. శ్రావణ చివరి సోమవారం కావడంతో మండలంలోని మాచవరంలో ఉన్న వరాల రామాలయ క్షేత్రంలోని రామలింగేశ్వర స్వామి ఆలయం భక్తులతో కిక్కిరిసింది. బ్రహ్మశ్రీ కోలగంటి శ్రీరామభద్ర శర్మ, కాశీ సామవేద యజుర్వేద పండితులు, మల్లికార్జున పూజారి ఆధ్వర్యంలో శివలింగ ప్రతిష్ఠాపన మహోత్సవాన్ని అంగరంగ వైభవంగా నిర్వహించారు. శివలింగాన్ని ప్రతిష్ఠించి స్వామివారికి శాంతి కల్యాణం నిర్వహించారు. ఎమ్మెల్యే పద్మాదేవేందర్ రెడ్డి, ఇఫ్కో డైరెక్టర్ దేవేందర్‌రెడ్డి లింగ ప్రతిష్ఠ, ధ్వజశిఖర ప్రాణ ప్రతిష్ఠలో పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు. ఆలయ ఉత్సవ కమిటీ వారికి ఘనంగా స్వాగతం పలికి, సన్మానించారు. ఈ మహోత్సవాన్ని తిలకించేందుకు భక్తులు భారీగా తరలివచ్చారు. అనంతరం అన్నదానం చేశారు. కార్యక్రమంలో జడ్పీ వైస్ చైర్పర్సన్ లావణ్యారెడ్డి, ఆత్మ కమిటీ చైర్మన్ అంజాగౌడ్ మాచవరం, మెదక్ పీఏసీఎస్ చైర్మన్లు సీతారామయ్య, హనుమంత్‌రెడ్డి, ఆత్మ కమిటీ డైరెక్టర్ బెల్లం శ్రీనివాస్, రైతు బంధు సమితి మండల అధ్యక్షుడు కిష్టయ్య, సర్పంచులు ప్రభాకర్, వెంకటేశం, మున్సిపాల్ చైర్మన్ చంద్రపాల్, వైస్ చైర్మన్ మల్లికార్జున్‌గౌడ్, ఆలయ ఉత్సవ కమిటీ సభ్యులు సుబ్బారావు, లక్ష్మీనారాయణ, ప్రసాద్‌రావు, రాధాకృష్ణ, వెంకటేశ్వరరావు, హరిబాబు, సాంబశివరావు, చెంచయ్య, నాయకులు లింగరెడ్డి, రాగి అశోక్, కృష్ణ గౌడ్, రాములు, నవీన్, రవి, సత్తయ్య పాల్గొన్నారు.